TSLPRB 2022: ఈ రోజుతో ముగుస్తున్న తెలంగాణ అగ్నిమాపక శాఖ 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ దరఖాస్తు ప్రక్రియ..!

తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు అలర్ట్‌! రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ (Driver Operator) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే ఆఖరు.. వెంటనే..

TSLPRB 2022: ఈ రోజుతో ముగుస్తున్న తెలంగాణ అగ్నిమాపక శాఖ 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ దరఖాస్తు ప్రక్రియ..!
Telangana Health department
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 26, 2022 | 1:13 PM

TSLPRB Driver Operator Recruitment 2022 application last date: తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు అలర్ట్‌! రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ (Driver Operator) పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) మే 20న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంటే ఈ రోజుతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందన్నమాట. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022, జులై 1 నాటికి అభ్యర్ధుల వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. యూనీఫాం ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది కూడా. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ సందర్భంగా సూచించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర పూర్తి సమాచారం క్లుప్తంగా మీకోసం..

వివరాలు:

పోస్టుల సంఖ్య: 225

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి 21 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. మే 20, 2022 ప్రకారం ప్రభుత్వ యూనిఫాం సర్వీసులకు మరో ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇచ్చింది.

పే స్కేల్: నెలకు రూ.31040 ల నుంచి రూ.92050 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. (లేదా) పదో తరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ మెకానిక్‌ డీజిల్‌/ ఫిట్టర్‌ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వాలిడ్‌ హెచ్‌ఎంవీ లైసెన్స్‌తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓసీ/ బీసీ అభ్యర్థులు: రూ.800
  • తెలంగాణకు చెందిన ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: మే 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు