IIT Bhubaneswar Jobs 2022: టెన్త్‌/బీఈ/ బీటెక్‌ అర్హతతో ఐఐటీ భువనేశ్వర్‌లో 83 నాన్ టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తివివరాలివే..

భారత ప్రభుత్వానికి చెందిన భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Bhubaneswar).. వివిధ విభాగాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల (Non Teaching Posts) భర్తీకి అర్హులైన..

IIT Bhubaneswar Jobs 2022: టెన్త్‌/బీఈ/ బీటెక్‌ అర్హతతో ఐఐటీ భువనేశ్వర్‌లో 83 నాన్ టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తివివరాలివే..
Iit Bhubaneswar
Follow us
Srilakshmi C

|

Updated on: May 25, 2022 | 1:50 PM

IIT Bhubaneswar Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Bhubaneswar).. వివిధ విభాగాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల (Non Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 83

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: నాన్‌ టీచింగ్‌ పోస్టులు

విభాగాలు: అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు, జూనియర్‌ సూపరింటెండెంట్‌, ఫిజియోథెరపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ పాథాలజిస్ట్‌, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.18,000ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌), ఐఐటీ భవనేశ్వర్‌, ఒడిషా-752050

దరఖాస్తులకు చివరితేదీ: జులై 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.