TSPSC Group-1 2022: రెండు లక్షలు దాటిన టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తులు.. ఇంకా పెరిగే అవకాశం!

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. గ్రూప్‌ 1 పోస్టులకు మే 2న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు గ్రూప్‌-1 దరఖాస్తులు 2 లక్షలు దాటినట్లు..

TSPSC Group-1 2022: రెండు లక్షలు దాటిన టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తులు.. ఇంకా పెరిగే అవకాశం!
Tspsc Group 1
Follow us
Srilakshmi C

|

Updated on: May 25, 2022 | 11:16 AM

TSPSC Group-1 2022 Application last date: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. గ్రూప్‌ 1 పోస్టులకు మే 2న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు గ్రూప్‌-1 దరఖాస్తులు 2 లక్షలు దాటినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు గడువు మే 31తో ముగియనుంది. తొలిరోజు 3,895 దరఖాస్తులురాగా, మే 24న‌ రాత్రి నాటికి 2,00,428 దాటినట్లు కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల ప్రభుత్వం గ్రూప్‌-1లో యూనిఫాం పోస్టులైన డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచింది. డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టులకు పోటీపడే పురుష, మహిళా అభ్యర్థులకు ఎత్తును తగ్గించింది. అర్హులైన అభ్యర్థులు చివరిరోజు వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో అధిక సంఖ్యలో గ్రూప్‌ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు చివరి తేదీ నాటికి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 80,000ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్‌1తో పాటు పలు పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్‌1 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మే 2 నుంచి ప్రారంభమైంది. మొత్తం 18 శాఖల్లో 503 పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..