TS Excise Constable Jobs: తెలంగాణ ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ శాఖల్లో 677 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజే ఆఖరు..
హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ (TS Excise and transport)విభాగాల్లో 677 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది..
TS Excise Constable Recruitment 2022 Application last date: హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ (TS Excise and transport)విభాగాల్లో 677 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 614 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభంకాగా.. నేటితో (మే 26) దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే అధికారిక వెబ్‌సైట్ www.tslprb.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ సందర్భంగా సూచించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర పూర్తి సమాచారం క్లుప్తంగా మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 677
- టాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు: 63
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు: 614
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: జులై 1, 2022 నాటికి ఇంటర్మీడియట్/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు తప్పని సరిగా మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్థులకు: రూ.1000
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు, రూ.500
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: మే 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.