AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Police Constable Recruitment 2022: చివరి అవకాశం! తెలంగాణలో 17,516 పోలీస్ ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..

ఈ రోజు (మే 26) రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే..

TS Police Constable Recruitment 2022: చివరి అవకాశం! తెలంగాణలో 17,516 పోలీస్ ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..
Ts Police Jobs
Srilakshmi C
| Edited By: |

Updated on: May 26, 2022 | 1:13 PM

Share

TS Police Constable, SI Recruitment 2022 Application last date: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17,516 పోలీస్‌ కొలువులకు 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ మొత్తం నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే ఆఖరు. వీటిల్లో భారీ మొత్తంలో 16,614 కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులకు తొలి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్‌ పోస్టులు 16,027 ఉండగా, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 587దాకా ఉన్నాయి. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రోజు (మే 26) రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున.. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా తెలంగాణ స్టేట్ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) సూచించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inలో ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ సందర్భంగా సూచించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర పూర్తి సమాచారం క్లుప్తంగా మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 16,614

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: కానిస్టేబుల్‌ పోస్టులు 16027, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 587

ఖాళీల వివరాలు:

  • సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 4965
  • ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 4423
  • ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 100
  • టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ పోస్టులు: 5010
  • తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ విభాగం పోస్టులు: 390
  • డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ విభాగం పోస్టులు: 610
  • జైల్‌ వార్డర్లు (మేల్‌) పోస్టులు: 136
  • జైల్‌ వార్డర్లు (ఫిమేల్‌) పోస్టులు: 10
  • ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఆర్గనేజేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 262
  • కానిస్టేబుల్‌ (మెకానిక్‌ (మెన్‌)) పోస్టులు: 21
  • కానిస్టేబుల్‌ (డ్రైవర్లు) పోస్టులు: 100
  • సివిల్‌ ఎస్‌ఐ పోస్టులు: 414
  • ఏఆర్‌ ఎస్‌ఐ పోస్టులు: 66
  • ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ పోస్టులు: 5
  • టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులు: 23
  • తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగం ఎస్‌ఐ పోస్టులు: 12
  • డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ విభాగం పోస్టులు: 26
  • డిప్యూటీ జైలర్‌ పోస్టులు: 8
  • టెక్నికల్‌ ఎస్‌ఐ పోస్టులు: 22
  • ఎస్‌ఐ పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనేజేషన్‌ (మెన్‌) పోస్టులు: 03
  • అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో) పోస్టులు: 08

పే స్కేల్‌:

  • కానిస్టేబుల్‌ పోస్టులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నెలకు రూ.42,300 నుంచి రూ. 1,15,270 ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కానిస్టేబుల్‌ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేది: మే 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!