AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..! ఆరెంజ్, పర్పుల్ క్యాప్ తోపులు వీళ్లే..?

IPL 2026 Playoffs Teams: టీ20 వరల్డ్ కప్ 2026 విజయోత్సాహంలో ఉన్న భారత్, ఇప్పుడు ఐపీఎల్ మేనియాలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్‌పై ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర అంచనాలు వేశారు. ప్లే ఆఫ్స్ చేరే జట్లు, ఆరెంజ్ క్యాప్ విజేత, ఎమర్జింగ్ ప్లేయర్ గురించి ఆయన చెప్పిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం!

IPL 2026: రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..! ఆరెంజ్, పర్పుల్ క్యాప్ తోపులు వీళ్లే..?
Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 20, 2026 | 12:18 PM

Share

భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తర్వాత, క్రికెట్ ప్రేమికుల దృష్టి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌పై పడింది. మార్చి 28 నుంచి మొదలుకానున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికరమైన అంచనాలను పంచుకున్నారు. ఈసారి టైటిల్ రేసులో ఏ జట్లు ముందుంటాయి, వ్యక్తిగత అవార్డులు ఎవరు గెలుచుకుంటారనే దానిపై ఆయన స్పష్టతనిచ్చారు.

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసు..

ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశం సంజు శాంసన్ కే ఎక్కువగా ఉందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఇటీవల రాజస్థాన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారిన సంజు, వరల్డ్ కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో 321 పరుగులు చేయడమే కాకుండా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు, అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తాడని చోప్రా పేర్కొన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో, ముంబై ఇండియన్స్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా పర్పుల్ క్యాప్ రేసులో అందరికంటే ముందుంటాడని ఆయన జోస్యం చెప్పారు.

ఎమర్జింగ్ ప్లేయర్ సంచలనం..

ఈ ఏడాది ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గెలుచుకునే అవకాశం ఉందని చోప్రా తెలిపారు. అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ యువ బ్యాటర్, ఐపీఎల్‌లో తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో కొత్త రికార్డులు సృష్టిస్తాడని విశ్లేషించారు.

ప్లే ఆఫ్స్ చేరే ఆ నాలుగు జట్లు..

అత్యంత ఉత్కంఠభరితమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు గురించి మాట్లాడుతూ, ఆకాష్ చోప్రా నాలుగు జట్ల పేర్లను వెల్లడించారు. అతని విశ్లేషణ ప్రకారం ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టనున్నట్లు తెలిపారు.

ఈ నాలుగు జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను దక్కించుకుంటాయని ఆయన అంచనా వేశారు. ఆశ్చర్యకరంగా చెన్నై, కోల్‌కతా వంటి బలమైన జట్లను ఆయన టాప్-4 జాబితాలో చేర్చకపోవడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?