AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!

నిత్యం రద్దీగా తిరిగే హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు రాకపోకలు సాగించే మెట్రో రైలు సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే దాదాపు 20 నిమిషాల పాలు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది.

Hyderabad: మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
metro
Anand T
|

Updated on: Mar 20, 2026 | 12:20 PM

Share

నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తూ హైదరాబాద్‌ నగర రవాణాలో కీలకంగా ఉన్న మెట్రో రైల్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. నాగోల్‌ నుంచి రాయదుర్గం మార్గంలో రాకపోకాలు సాగించే మెట్రో జూబ్లీహిల్స్ చెక్‌ పోస్ట్ మెట్రో స్టేషన్‌లో సాంకేతిక కారణాల కారణంగా నిలిచి పోయింది. దీంతో ఆఫీస్‌లకు వెళ్లవలసి ప్రయాణికులు మెట్రోలోనే చిక్కుకుపోయారు. వెంటనే మరమ్మత్తులు చేపట్టిన మెట్రో సిబ్బంది మళ్లీ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు యథావిధిగా తమ గమ్య స్థానాలను చేరుకున్నారు.

సాంకేతిక సమస్య కారణంగా మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆఫీస్ టైం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు చేపట్టిన మరమ్మతుల తర్వాత మెట్రో సర్వీసులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు అంతా ఊపిపీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us