అందంలో దేవకన్య.. శ్రుతి మల్టీటాలెంట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Rajitha Chanti

Pic credit - Instagram

07  July 2026

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, గాయని, సంగీత దర్శకురాలు శ్రుతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

కేవలం ఒక నటిగానే కాకుండా, మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతి హాసన్, ప్రతిభకు నిలువుటద్దం. ఆమె కెరీర్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

శ్రుతి హాసన్ కేవలం నటనకే పరిమితం కాకుండా, సంగీత రంగంలోనూ విశేషమైన ప్రతిభను చాటుకుంది. అంతేకాదు ఆమె మంచి సింగర్  కూడా..

తన తండ్రి కమల్ హాసన్ నటించిన 'ఈనాడు' (తమిళంలో ఉన్నైపోల్ ఒరువన్) చిత్రానికి సంగీత దర్శకురాలిగా పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

హీరోయిన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రుతి, తనకు నచ్చిన ప్రత్యేక గీతాల్లో టించడానికి కూడా వెనుకాడదు. తాజాగా 'పెద్ది'లో కనిపించింది.

మహేశ్ 'ఆగడు' చిత్రంలోని "జంక్షన్‌లో" పాట నుండి అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తన గాత్రంతో అలరించింది. ఆమెకు ఎనిమిది భాషలపై పట్టు ఉండటం విశేషం.

శ్రుతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు.. 'ఇసిడ్రో' పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, డిజిటల్ కంటెంట్, షార్ట్ ఫిల్మ్స్ , మ్యూజిక్ వీడియోలను నిర్మిస్తున్నారు.

సైకాలజీ చదువుకున్న ఆమెకు స్క్రిప్ట్ రాయడం, పాటలు కంపోజ్ చేయడం, పెయింటింగ్ వేయడం వంటివి హాబీలు. చిన్నతనంలోనే భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు.