నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్, ఎగ్స్ ధర
విజయవాడలో చికెన్, కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.340 వరకు, డజను గుడ్లు రూ.100కు చేరాయి. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల, పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయవాడలో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. గత కొన్ని వారాలుగా ధరలు వరుసగా పెరుగుతుండటంతో మాంసాహారం తినే సాధారణ కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలోనూ చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేవలం కొన్ని వారాల క్రితం వరకు కిలో రూ. 250 లోపు లభించిన స్కిన్‌లెస్ చికెన్.. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.340 మార్కును తాకింది. ఫారాల నుంచి వచ్చే లైవ్ బర్డ్ ధరలు పెరగడంతో పాటు రిటైల్ మార్కెట్‌లో అదనపు ఖర్చులు తోడై వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. ఇక చికెన్‌తో పోటీ పడుతూ కోడిగుడ్ల ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. మొన్నటి వరకు డజను రూ. 80 లోపు పలికిన గుడ్లు ధర, ఇప్పుడు రూ. 100 కి చేరుకుంది. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.8 నుంచి రూ. 8.50 వరకు విక్రయిస్తున్నారు. వేసవి తీవ్రత ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం, దీనికి తోడు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే ఈ ధరల మంటకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం
వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

