AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!

అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!

Phani CH
|

Updated on: Jul 06, 2026 | 4:56 PM

Share

పెంకు లేని కృత్రిమ గుడ్డులో నుంచి తొలిసారిగా ఆరోగ్యకరమైన కోడిపిల్లను శాస్త్రవేత్తలు విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. అమెరికాకు చెందిన కలొసల్ బయోసైన్సెస్ రూపొందించిన ప్రత్యేక సిలికాన్ గుడ్డు నిర్మాణం సహజ గుడ్డు మాదిరిగానే పనిచేసింది. అంతరించిపోతున్న అరుదైన పక్షుల సంరక్షణలో ఈ సాంకేతికత విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.

కోడిగుడ్డు అనగానే తెల్లగా.. గట్టి పెంకుతో కూడిన గుడ్డు మనకు తెలుసు. ఈ గుడ్లను కోళ్లు సహజంగా పొదగడం ద్వారా కోడిపిల్లలు పుడతాయి. తాజాగా ఈ ప్రక్రియనే మార్చేశారు శాస్త్రవేత్తలు. కృత్రిమ గుడ్లద్వారా కూడా కోడిపిల్లలను పుట్టించవచ్చని నిరూపించారు. పెంకు లేని కృత్రిమ గుడ్డులోంచి తొలిసారిగా ఒక కోడిపిల్లను విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. అంతరించిపోతున్న అరుదైన పక్షుల సంరక్షణలో ఈ ప్రయోగం ఒక విప్లవాత్మక ముందడుగుగా భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ ‘కలొసల్ బయోసైన్సెస్’ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. సహజమైన గుడ్డు పెంకు స్థానంలో శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక సిలికాన్ పొరతో కూడిన కృత్రిమ నిర్మాణాన్ని రూపొందించారు. సాధారణంగా గుడ్డు పెంకు పిండాన్ని రక్షించడంతో పాటు శ్వాసక్రియకు అవసరమైన వాయువుల మార్పిడిని నియంత్రిస్తుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ కృత్రిమ సిలికాన్ పొర కూడా ఆక్సిజన్ లోపలికి చేరేలా, కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లేలా పర్ఫెక్ట్‌గా పనిచేసింది. ఫలితంగా పిండం పూర్తిగా అభివృద్ధి చెంది, ఆరోగ్యకరమైన కోడిపిల్ల జన్మించింది. ప్రకృతిలో అంతరించిపోతున్న అరుదైన పక్షుల గుడ్లను సంరక్షించడం చాలా కష్టమైన పని. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ కృత్రిమ గుడ్డు సాంకేతికత పక్షుల జాతిని కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అన్ని రకాల పక్షులపై ఈ విధానం ఒకేలా పనిచేస్తుందా లేదా అనే అంశంపై భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు నిర్వహించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్‌టైమ్ రికార్డ్!

Papikondalu: ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్.. పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?

E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!

పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన

Bogatha Waterfall: ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు

Follow Us