పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో పెళ్లి వేడుకలో అతిథిగా వచ్చిన దొంగ రూ.5 లక్షల నగదు, బంగారం, చీర ఉన్న బ్యాగును అపహరించాడు. బాధితులు వెంటనే 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వేగంగా స్పందించి, కేవలం మూడు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి మొత్తం సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు.
ఎవడి గోలవాడిది అంటే ఇదేనేమో.. ఓవైపు వేదికపై పెళ్లి జరుగుతోంది. బంధుమిత్రులంతా పెళ్లి హడావిడిలో మునిగిపోయారు. ఇదే అదనుగా పెళ్లికి అతిథిలా వచ్చిన ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. వధువు తాలూకు బంధువుకు చెందిన బ్యాగును పట్టుకొని పారిపోయాడు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో జరిగిన పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న భారీ చోరీ కేసును పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే ఛేదించారు. పెళ్లి హడావుడిలో ఉన్న బాధితులు తక్షణమే అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించడంతో, నిందితుడి ఆట కట్టించి దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. నాతవరం మండలం శృంగవరం గ్రామంలో ఒక వివాహ వేడుక జరుగుతుండగా, వధువు బంధువుకు చెందిన ఒక బ్యాగును పైలా చిట్టిబాబు అనే వ్యక్తి అపహరించాడు. ఆ బ్యాగులో రూ. 5 లక్షల నగదుతో పాటు విలువైన బంగారం, కొత్త చీర ఉన్నాయి. బ్యాగు దొంగిలించి నిందితుడు పారిపోవడాన్ని గమనించిన బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘112’ అత్యవసర నంబర్‌కు కాల్ చేసి పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న నాతవరం పోలీసులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. టెక్నాలజీ సాయంతో దర్యాప్తును వేగవంతం చేసి, కేవలం 3 గంటల వ్యవధిలోనే నిందితుడైన పైలా చిట్టిబాబును పట్టుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ. 5 లక్షల నగదు, బంగారం, చీరతో కూడిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపద సమయంలో క్షణాల వ్యవధిలో స్పందించి, పోయిన సొత్తును దక్కించిన పోలీసులకు బాధితులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bogatha Waterfall: ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు
‘ద డీప్‌ఫేక్ డిఫెన్స్’.. టాలీవుడ్ స్టార్స్ Vs AI
తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే!
Kadapa: 30 మంది విద్యార్ధులతో దూసుకెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా ఊడిపోయిన రెండు చక్రాలు..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

