Bogatha Waterfall: ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు
తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా బొగత జలపాతం తొలకరి వరదలతో మళ్లీ పరవళ్లుతొక్కుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎనిమిది నెలల తర్వాత జలపాతానికి జలకళ వచ్చింది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుండగా, వారి భద్రత కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం తొలకరి వరదతో పరవళ్లుతొక్కుతోంది. ములుగు జిల్లాలో పర్యాటకులను మంత్రముగ్దులను చేసే ఈ బొగత జలపాతం పర్యాటకులను రా రామ్మంటూ ఎగసిపడుతోంది. నీళ్లు లేక దాదాపు ఎనిమిది నెలల పాటు వెలవెలబోయిన ఈ జలపాతం, ఇప్పుడు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ పొంగిపొర్లుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం.. సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పాలధారలా జాలువారుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చే సందర్శకులు, ఇక్కడి ప్రకృతి అందాలను చూడగానే తమ అలసటనంతా మరిచిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోతున్నారు. జలపాతాల వద్ద జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పుడిప్పుడే సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జలపాతం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ద డీప్‌ఫేక్ డిఫెన్స్’.. టాలీవుడ్ స్టార్స్ Vs AI
తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే!
Kadapa: 30 మంది విద్యార్ధులతో దూసుకెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా ఊడిపోయిన రెండు చక్రాలు..
ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు
తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

