AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలెంట్ ఉన్నా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ఎందుకు రావడం లేదు? యంగ్ హీరోయిన్లకు ఇదే పెద్ద అడ్డంకి!

టాలెంట్ ఉన్నా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ఎందుకు రావడం లేదు? యంగ్ హీరోయిన్లకు ఇదే పెద్ద అడ్డంకి!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 8:58 PM

Share

చిన్న సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకుని, తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న యంగ్ హీరోయిన్లకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం అవకాశాలు దక్కడం కష్టంగా మారుతోంది. వైష్ణవి చైతన్య వంటి ప్రతిభావంతులైన నటీమణులు గుర్తింపు తెచ్చుకున్నా.. పాన్ ఇండియా మార్కెట్, గ్లామర్, గ్లోబల్ అప్పీల్ వంటి కమర్షియల్ లెక్కలతో మేకర్స్ బాలీవుడ్ భామల వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌లో ఒకప్పుడు చిన్న సినిమాతో అద్భుతమైన హిట్టు కొడితే, ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ క్యూ కట్టేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాల్లో పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసినా, మన యంగ్ బ్యూటీస్ కి టాప్ లీగ్‌లో ఎంట్రీ మాత్రం దక్కడం లేదు. అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తోంది, టాలెంట్ ఉన్నా వీళ్లని బడా స్టార్లు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్, 8 వసంతాలు లాంటి సినిమాల్లో హీరోయిన్స్ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా వీళ్ళు ఏ స్టార్ హీరోయిన్ కి తీసిపోరనే ప్రశంసలు కూడా దక్కాయి. అయినా సరే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వచ్చేసరికి వీళ్ళను చిన్న సినిమాలకే పరిమితం చేస్తున్నారు తప్ప, మీడియం రేంజ్‌ కాస్టింగ్ లోకి తీసుకోవట్లేదు. ఈ లిస్ట్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు వైష్ణవి చైతన్య. కల్ట్ బ్లాక్ బస్టర్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ తెలుగమ్మాయికి మీడియం రేంజ్ హీరోల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఆమె పెర్ఫార్మెన్స్ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కానీ, ఎంత గుర్తింపు వచ్చినా పెద్ద హీరోల క్యాంప్ నుంచి మాత్రం ఆమెకు పిలుపు రాకపోవడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆశ్చర్యం కలిగిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న సినిమాల బ్యూటీస్‌ను కాస్ట్ చేయకపోవటం వెనుక చాలా లెక్కలు ఉన్నాయి. పాన్ ఇండియా అప్పీల్, గ్లామర్ డోస్, గ్లోబల్ మార్కెట్ లాంటి కమర్షియల్ ఫ్యాక్టర్స్ వల్ల బాలీవుడ్ భామల వైపే మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. దీంతో యాక్టింగ్ స్కోప్ ఉన్న చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకున్న మన హీరోయిన్లకు, స్టార్ బ్రాకెట్ లోకి వెళ్లడం బిగ్‌ టాస్క్ లా మారిపోయింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్‌తోనూ మెప్పించే తారలను ఎంకరేజ్ చేస్తే స్క్రీన్ పై ఫ్రెష్ నెస్ వస్తుంది. కేవలం పాన్ ఇండియా మానియాతో టాలెంట్ ఉన్న లోకల్ బ్యూటీలను పక్కనపెట్టడం కరెక్ట్ కాదన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. మరి ఫ్యూచర్‌లో అయినా… చిన్న సినిమాల హీరోయిన్లకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్‌ వస్తాయేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్

Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?

Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది

పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

Follow Us