AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్

Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్

Phani CH
|

Updated on: Aug 14, 2026 | 8:57 PM

Share

నేచురల్ స్టార్ నాని హీరోయిన్ల ఎంపిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కొన్నేళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లతో జోడీ కట్టేందుకు ఆయన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కీర్తి సురేష్, సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి వంటి భామలతో నటించిన నాని.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'లో కయాదు లోహర్‌తో జోడీ కడుతున్నారు. సుజీత్ దర్శకత్వంలోని 'బ్లడీ రోమియో'లో భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో నాని హీరోయిన్స్ సెలక్షన్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.. కెరీర్ మొదట్లో జోడీ గురించి పెద్దగా పట్టింపుల్లేని న్యాచురల్ స్టార్.. కొన్నేళ్లుగా మాత్రం డిఫెరెంట్ రూట్ ఫాలో అవుతున్నారు. ట్రెండింగ్ బ్యూటీస్‌తో జోడీ కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారీయన. ఆ టైమ్‌లో ఎవరు బాగా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంటే వాళ్లకే నానితో నటించే ఆఫర్ వస్తుంది. ఇప్పుడూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నానితో నటించాక హీరోయిన్లు ట్రెండ్ అవుతున్నారో లేదంటే ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటీస్‌తోనే నాని నటిస్తున్నారో తెలియదు కానీ ట్రెండింగ్ అయితే కామన్ అయిపోతుంది. అప్పుడెప్పుడో పదేళ్ల కింద నేను లోకల్‌లో కీర్తితో జోడీ కట్టారు నాని.. ఆ తర్వాత ఆమె జాతకం మారిపోయింది. అలాగే ఫిదా టైమ్‌లో ఫుల్ ట్రెండ్ అవుతున్న సాయి పల్లవితో MCA చేసి హిట్ కొట్టారు న్యాచురల్ స్టార్. హీరోయిన్ల ఎంపికలో నాని చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తన మార్కెట్‌తో పాటు హీరోయిన్ ఇమేజ్ కూడా లెక్కలేసుకుంటున్నారు. సీతా రామంతో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న మృణాళ్ ఠాకూర్‌తో అప్పుడు హాయ్ నాన్న చేసారు నాని.. అలాగే ఉప్పెనతో సంచలనం రేపిన కృతి శెట్టితో వెంటనే శ్యామ్ సింగరాయ్‌లో నటించారు. ఇప్పుడు కూడా ప్యారడైజ్‌లో ట్రెండింగ్ బ్యూటీ కయాదు లోహర్ నటిస్తున్నారు. డ్రాగన్ టైమ్‌లో బాగా ట్రెండ్ అవుతున్నపుడే కయాదుని తన సినిమాలోకి తీసుకున్నారు నాని. నెక్ట్స్ సుజీత్ దర్శకత్వంలో నటించబోయే బ్లడీ రోమియో కోసం మరో ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు బలంగా వినిపిస్తుంది. లెనిన్‌తో ఈ మధ్యే హిట్ కొట్టారు ఈ భామ. అంతలోనే నానితో ఆఫర్ వచ్చేలా ఉంది. అంతేకాదు ప్యారడైజ్‌లో కీర్తి సురేష్ అదిరిపోయే స్పెషల్ సాంగ్ కూడా చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?

Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది

పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!

Follow Us