Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే!
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. జులై 6న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.110 తగ్గి రూ.1,46,620కు చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.1,34,400 పలికింది. కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,50,000కు చేరింది. ప్రధాన నగరాల తాజా ధరలు తెలుసుకోండి.
అంతర్జాతీయ మార్కెట్‌లో లాభాల స్వీకరణ , డాలర్ కదలికలు, అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి ధర తగ్గడంతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. రాబోయే రోజుల్లో విలువైన లోహాల ధరల దిశ ఎలా ఉండబోతుందన్నదానిపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 6 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110లు తగ్గి 1,46,620 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం పై రూ.100లు తగ్గి రూ.1,34,400లుగా కొనసాగుతోంది. కేజీ వెండిపై రూ.10,000లు తగ్గి రూ.2,50,000లకు చేరింది. జులై 6 సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,46,770 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,550 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,620 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,400 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,47,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,35,600 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,620 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,400 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,50,000 లు పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్ చేసుకొని వెళితే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kadapa: 30 మంది విద్యార్ధులతో దూసుకెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా ఊడిపోయిన రెండు చక్రాలు..
Tirupati: లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
డబ్బుసంచితో బైక్పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్లోనే
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

