Kadapa: 30 మంది విద్యార్ధులతో దూసుకెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా ఊడిపోయిన రెండు చక్రాలు..
కడప జిల్లా పులివెందులలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రయాణంలోనే వెనుక రెండు టైర్లు ఊడిపోవడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సు సురక్షితంగా ఆగింది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కడప జిల్లా పులివెందులలో సోమవారం ఉదయం ఒక పాఠశాల బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజూలాగే విద్యార్థులను ఎక్కించుకుని స్కూలుకు వెళ్తున్న సమయంలో ఈ ఊహించని ఘటన జరిగింది. బస్సు ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా వెనుక వైపు ఉన్న రెండు టైర్లు ఊడిపోయాయి. రన్నింగ్‌లో ఉండగా టైర్లు ఊడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే కేకలు వేస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. స్థానికుల హెచ్చరికతో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్, స్థానికుల అప్రమత్తత వల్ల విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. అసలు బస్సు నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందా? లేక ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. అంతేకాదు, ఈ ఘటన స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, రవాణా శాఖ నిబంధనలు, భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి పాలకులను, అధికారులను ప్రశ్నించేలా చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఇలాంటి విషయాల్లో విద్యాసంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారులు తూతూమంత్రంగా కాకుండా కఠినంగా ఫిట్‌నెస్ తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirupati: లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
డబ్బుసంచితో బైక్పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్లోనే
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

