సమానత్వానికి సరికొత్త పాఠం.. విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు
మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వి. గోపీనాథ్ విద్యార్థులతో మరింత ఆత్మీయత పెంచేందుకు వారంలో రెండు రోజులు వారిలాగే స్కూల్ యూనిఫాం ధరించి బోధిస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సమానత్వం, ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయనపై విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
“నేను మీ టీచర్‌ను మాత్రమే కాదు.. మీలో ఒకడిని, మీ క్లాస్‌మేట్‌ను” అంటూ విద్యార్థులతో మమేకమవుతున్నారు ఆ ఉపాధ్యాయుడు. విద్యార్థుల తరహాలోనే తానూ స్కూల్ యూనిఫాం ధరించి విధులకు హాజరవుతూ, సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు… వి.గోపీనాథ్ చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది. పాఠశాలలో విద్యార్థులందరూ సమానమే అనే భావన కలిగించడానికి యూనిఫాం విధానాన్ని అమలు చేస్తారు. అయితే, విద్య నేర్పే గురువు కూడా తమతో సమానమేనన్న నమ్మకాన్ని, ఆత్మీయతను పిల్లల్లో నింపేందుకు గోపీనాథ్ ఈ వినూత్న ప్రయత్నం చేశారు. వారంలో రెండు రోజులు విద్యార్థులు వేసుకునే స్కూల్ డ్రెస్ ధరించి ఆయన విధులకు హాజరవుతారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇలా యూనిఫాంలో కనిపించడం చూసి మొదట్లో ఊరంతా ఇదేం విచిత్రం అనుకున్నా.. ఆయన ఆశయాన్ని చూసి ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. విద్య అంటే కేవలం అక్షరాలు మాత్రమే కాదు.. సమానత్వం, గౌరవం, నమ్మకం అని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. తాము ‘ప్రభుత్వ బడి పిల్లలం’ అని విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా చేయడమే తన సంకల్పమని గోపీనాథ్ గర్వంగా చెబుతున్నారు. ఈ మాస్టారు వినూత్న ఆలోచనను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత అభినందించగా, ఉపాధ్యాయుడిని తమలో ఒకడిగా చూసుకుంటూ విద్యార్థులు ఆనందంగా బడికి వస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే.. వాటి జోలికి పోరు!
పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం
మానవత్వం చాటుకున్న టీచర్ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.
వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..! డే కేర్ సెంటర్‌లో దారుణం
విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు
దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా?
పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం
మానవత్వం చాటుకున్న టీచర్ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.
వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..!
తిరుమల శ్రీవారి తొలి దర్శన భాగ్యం ఈయనకే !
హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు?

