AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.

Phani CH
|

Updated on: Jul 04, 2026 | 8:46 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినిని కాపాడేందుకు టీచర్ హేమ 6 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి ఆసుపత్రికి చేర్చారు. రవాణా సౌకర్యం లేకపోయినా వెనుకడుగు వేయకుండా ఆమె చేసిన సేవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల లోపాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.

ఉపాధ్యాయులు విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి అంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు అంతటి భరోసా.. రక్షణ దొరికేది గురువు దగ్గరే. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే అంతటి స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానాన్ని అక్షరాలా నిజం చేసి చూపించారు ఓ టీచర్‌. ఆపదలో ఉన్న విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు ఒక ప్రభుత్వ పాఠశాల వార్డెన్ కం టీచర్‌.. చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న భువనేశ్వరి అనే విద్యార్థిని అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. సమయం గడుస్తున్న కొద్దీ బాలిక పరిస్థితి విషమించసాగింది. అయితే, ఆ మారుమూల ప్రాంతం నుండి ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఎలాగైనా ఆ బాలిక ప్రాణాలను కాపాడాలనే తపనతో ఆ పాఠశాల టీచర్‌ హేమని ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, విద్యార్థినిని ఒక డోలీలో ఉంచి, దాన్ని తన నడుముకు కట్టుకున్నారు. కనీసం నడవడానికి కూడా వీల్లేని గోతుల రోడ్డులో, ఆ బాలికను మోస్తూ ఏకంగా ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారు. మార్గమధ్యంలో నానా అవస్థలు పడుతూ, ఎట్టకేలకు భువనేశ్వరిని సమీప ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని పార్వతీపురం జిల్లా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. సరైన సమయంలో స్పందించి, సొంత తల్లిలా శ్రమించి విద్యార్థిని ప్రాణాలు కాపాడిన టీచర్‌ హేమనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఘటన మారుమూల గిరిజన ప్రాంతాల్లోని రోడ్డు, రవాణా సౌకర్యాల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..! డే కేర్ సెంటర్‌‌లో దారుణం

తిరుమల శ్రీవారి తొలి దర్శన భాగ్యం ఈయనకే !

గంటల తరబడి కూర్చునే డెస్క్‌ ఉద్యోగులకు హెచ్చరిక!

ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకాలంటే.. అవి బలంగా ఉండాల్సిందే!

హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!

Follow Us