హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా అనేక హోటళ్లలో 13వ గది లేదా 13వ అంతస్తు కనిపించకపోవడానికి ‘ట్రిస్కైడెకాఫోబియా’ అనే సంఖ్య భయమే ప్రధాన కారణం. అతిథులు 13 సంఖ్యను అశుభంగా భావించి ఆ గదులను బుక్ చేయడానికి వెనుకాడటంతో హోటళ్లు 12A, 14 లేదా ఇతర నంబర్లను ఉపయోగిస్తుంటాయి. కొన్ని ఆసియా దేశాల్లో మాత్రం 4, 9 సంఖ్యలను కూడా ఇలాగే దాటవేస్తారు.
మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లినప్పుడు రూమ్ నంబర్లు లేదా లిఫ్ట్‌లోని అంతస్తుల నంబర్లను గమనించారా? 11, 12 తర్వాత నేరుగా 14వ నంబర్ కనిపిస్తుంది కానీ.. 13వ నంబర్ మాయమవుతుంది. ఇది యాజమాన్యాల పొరపాటు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక హోటళ్లు ఉద్దేశపూర్వకంగానే 13 నంబర్‌ను దాటేస్తుంటాయి. దాని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలా మంది పర్యాటకులు లేదా అతిథులు భయంతో 13వ నంబర్ గదిలో ఉండేందుకు ఇష్టపడరు. దీనివల్ల ఆ గదులు ఖాళీగా ఉండి హోటళ్లకు వ్యాపార నష్టం వస్తుంది. అందుకే హోటల్ యాజమాన్యాలు 13కు బదులుగా 12A, 14 లేదా ‘M’ వంటి పేర్లను ఉపయోగిస్తాయి. 13వ నంబర్ వెనుక ‘ట్రిస్కైడెకాఫోబియా’ (Triskaidekaphobia) అనే వింత భయం దాగిఉందట. అంటే 13 సంఖ్యను అరిష్టంగా, అశుభంగా భావించడం అన్నమాట. 13 సంఖ్యపై ఈ భయం శతాబ్దాల నాటి నమ్మకాలతో ముడిపడి ఉంది. ‘నార్స్’ పురాణాల ప్రకారం 13వ అతిథి రావడంతో విషాదం చోటుచేసుకుందని చెబుతారు. అలాగే క్రైస్తవ సంప్రదాయంలో యేసు ప్రభువు చివరి విందులో పాల్గొన్న 13వ వ్యక్తి జూడాస్ ద్రోహం చేయడం వల్ల ఈ సంఖ్యకు అశుభ ముద్ర పడిందని విశ్వసిస్తారు. అయితే అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉండదు. కొన్ని ఆసియా దేశాల్లో 13 కంటే 4, 9 సంఖ్యలను అశుభంగా భావిస్తారు. అందుకే అక్కడి హోటళ్లు ఆ నంబర్లను కూడా దాటవేస్తుంటాయి. టెక్నాలజీ యుగంలోనూ శతాబ్దాల నాటి మూఢనమ్మకాలు హోటల్ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చెప్పడానికి రూమ్ నంబర్ 13 లేకపోవడమే ఒక పెద్ద ఉదాహరణ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు?
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు

