గంటల తరబడి కూర్చునే డెస్క్ ఉద్యోగులకు హెచ్చరిక!
ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల మోకాళ్లు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి పెరిగి కీళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎర్గోనామిక్ కుర్చీలు, లంబార్ సపోర్ట్, ఫుట్ రెస్ట్, సిట్-స్టాండ్ డెస్క్‌లు ఉపయోగించడం, సరైన భంగిమలో కూర్చోవడం, ప్రతి గంటకోసారి లేచి నడవడం, తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కుర్చీకే పరిమితమై పని చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే, ఎక్కువసేపు తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల మోకాళ్లు, నడుము, తుంటి కీళ్లు, వెన్నెముకపై అదనపు ఒత్తిడి పడుతుందని.. ఇది కాలక్రమేణా కీళ్ల అరుగుదల, దీర్ఘకాలిక నొప్పులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చిన్నపాటి చిట్కాలు, పరికరాలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. కూర్చునేందుకు నడుముకు సరైన సపోర్ట్ ఇచ్చే ‘ఎర్గోనామిక్’ కుర్చీలను ఎంచుకోవాలి. ఇవి వెన్నెముక సహజ వంపును కాపాడతాయి. కుర్చీలో ‘మెమరీ ఫోమ్’ లేదా జెల్ సీట్ కుషన్లు, లంబార్ సపోర్ట్ పిల్లోలను ఉపయోగించడం వల్ల శరీర బరువు సమానంగా పంపిణీ అయి నడుముపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు నేలపై సరిగ్గా ఆనకపోతే ‘ఫుట్ రెస్ట్’ ఉపయోగించాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే, ఆఫీసుల్లో ‘సిట్-స్టాండ్ డెస్క్‌లు’ వాడటం వల్ల అవసరాన్ని బట్టి కూర్చోవడం, నిలబడటం మార్చుకోవచ్చు. దీనివల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు మోకాళ్లు ఎల్లప్పుడూ 90 డిగ్రీల కోణంలో ఉండేలా కుర్చీ ఎత్తును సర్దుబాటు చేసుకోవాలి. రెండు పాదాలు పూర్తిగా నేలపై ఆని ఉండాలి. చాలామంది కాళ్లు మడిచి కూర్చోవడం లేదా నేలపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇబ్బంది ఉండదనుకుంటారు, కానీ అది అపోహ మాత్రమే. ఇవి కీళ్ల అరుగుదలకు కారణమవుతాయి. సాధారణ కుర్చీలకు బదులుగా ‘బ్యాలెన్స్ బాల్ కుర్చీలు’ వాడటం వల్ల శరీరాన్ని సమతుల్యంగా ఉంచే కండరాలు బలోపేతమవుతాయి. ఇప్పటికే మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తేలికపాటి ‘నీ బ్రేసెస్’ వాడాలి. రోజూ యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్లతో చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం, నడిచేటప్పుడు నాణ్యమైన పాదరక్షలు ధరించడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. కూర్చునే విధానంపై నిత్యం కొద్దిపాటి శ్రద్ధ పెట్టడం, ప్రతి గంటకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుని శరీరాన్ని కదిలించడం వంటి చిన్న మార్పులు భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద కీళ్ల సమస్యలను సమర్థవంతంగా నివారిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకాలంటే.. అవి బలంగా ఉండాల్సిందే!
హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!
హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు?
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు

