పుస్తకాలు లేని రోజుల్లో మన పూర్వీకులు జ్ఞానాన్ని ఎలా సముపార్జించారు? మట్టి పలకలు, తాళపత్ర గ్రంథాలు, గురుకులాల్లో మౌఖిక బోధన ద్వారా విద్యను అభ్యసించారు. తాళపత్రాలపై వేదాలు, పురాణాలు రాసి, వాటిని భద్రపరిచి తరతరాలకు అందించారు. ఈ అమూల్యమైన వారసత్వం భారతీయ సంస్కృతికి ఒక తార్కాణం.