AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను చంపి బాత్‌రూమ్‌లో పాతేసింది.. ‘దృశ్యం’ సినిమా స్టైల్‌లో మర్డర్

భర్తను చంపి బాత్‌రూమ్‌లో పాతేసింది.. ‘దృశ్యం’ సినిమా స్టైల్‌లో మర్డర్

Phani CH
|

Updated on: Jul 05, 2026 | 8:28 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 45 రోజులుగా మిస్సింగ్‌గా ఉన్న వ్యక్తి మృతదేహం అతని ఇంటి బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టిన స్థితిలో బయటపడింది. మిస్సింగ్ కేసుగా ప్రారంభమైన దర్యాప్తు హత్యగా మారగా, భార్య నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య వెనుక అసలు కారణాలు, ఇతరుల ప్రమేయంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

45 రోజుల మిస్సింగ్ కేసుగా ఉన్న ఒక ఘటన.. ఇప్పుడు భయంకరమైన మర్డర్ కేస్‌గా మారింది. మొదట ఇది సాధారణ మిస్సింగ్ కేస్‌గా నమోదు చేసినప్పటికీ.. పోలీసుల దర్యాప్తులో ఇది పక్కా హత్యగా తేలింది. అందరినీ షాక్‌కు గురిచేసిన మరో విషయం ఏమిటంటే.. కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి మృతదేహం అతని సొంత ఇంట్లోనే, బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టిన స్థితిలో బయటపడింది. అయితే ఈ హత్య చేసింది అతని భార్యేనని..విచారణలో ఆమె అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అసలు ఈ హత్య గల కారణాలేంటి? హత్య ఎలా జరిగింది? ఇంత క్రూరంగా భర్తను చంపి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 45 రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు వెతుకుతుండగా.. చివరకు అతని మృతదేహం.. అతని సొంత ఇంట్లోనే.. బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టి ఉండటంతో, అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య చేసినట్లుగా ఆమె అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితురాలికి మరెవరైనా సాయం చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆగ్రాలోని సికంద్రా ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల సురేంద్ర కుమార్ శర్మ గత మే నెలలో కనిపించకుండా పోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త తిరిగి రాలేదని భార్య రూబీ.. బంధువులకు, ఇరుగుపొరుగు వారికి చెప్పింది. కొద్ది రోజుల తర్వాత పోలీసులకు కూడా మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సురేంద్ర కోసం దాదాపు 45 రోజుల పాటు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. బంధువులు, పరిచయస్తులను విచారించారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దర్యాప్తు సమయంలో పోలీసులు ఓ కీలక విషయాన్ని గమనించారు. రూబీ చెప్పిన వివరాల్లో పదేపదే మార్పులు కనిపించాయి. ఆమె సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు మరోసారి ఇంటిని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇంటి బాత్‌రూమ్‌లో కొత్తగా టైల్స్ వేసినట్లు, గోడలు, నేలపై తాజాగా ప్లాస్టరింగ్ చేసినట్లు గుర్తించారు. ఇది పోలీసులకు మరింత అనుమానం కలిగించింది. వెంటనే టైల్స్ తొలగించి తవ్వకాలు ప్రారంభించారు. కొద్దిసేపటికే భూమిలో పూడ్చిపెట్టిన స్థితిలో కుళ్లిపోయిన సురేంద్ర మృతదేహం బయటపడింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహం లభించిన తర్వాత రూబీని పోలీసులు కఠినంగా విచారించారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భర్తను హత్య చేసిన వెంటనే బాత్‌రూమ్‌లో గుంత తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టింది. అనంతరం మట్టితో కప్పి, ప్లాస్టరింగ్ చేసి కొత్త టైల్స్ వేయించి ఎలాంటి అనుమానం రాకుండా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ బాత్‌రూమ్ మరమ్మతుల కోసం ముందుగానే మేస్త్రీలు, కార్మికులను ఏర్పాటు చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారికి హత్య విషయం తెలుసా? లేక సాధారణ పనిగా భావించి వర్క్ చేశారా? అనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో హత్యకు గల అసలు కారణం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కుటుంబ కలహాలా? ఆస్తి వివాదమా? లేక మరేదైనా వ్యక్తిగత కారణమా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, ఇతర సాక్ష్యాల ఆధారంగా పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 45 రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆ వ్యక్తి కోసం వెదికారు. కానీ అదే వ్యక్తి.. అదే ఇంట్లో, బాత్‌రూమ్ నేల కింద పాతిపెట్టి ఉండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా మిస్సింగ్ కేసుల దర్యాప్తులో చిన్న చిన్న అనుమానాలను కూడా పోలీసులు ఎంత సీరియస్‌గా తీసుకుంటారో ఈ కేసు విషయంలో మరోసారి స్పష్టమైంది. భార్య వాంగ్మూలంలో వచ్చిన చిన్న చిన్న వ్యత్యాసాలే చివరకు ఈ సంచలన హత్య కేసును బయటపెట్టాయి. ప్రస్తుతం రూబీ పోలీసుల అదుపులో ఉంది. హత్యకు మరెవరైనా సహకరించారా? అసలు హత్యకు ఏ విధంగా ప్లాన్‌ చేసింది? మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టడంలో ఎవరి సాయం తీసుకుంది? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ ఘటన గతంలో సంచలనం సృష్టించిన “బ్లూ డ్రమ్ మర్డర్ కేస్”ను పోలి ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆ కేసులో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్ రాజ్‌పుత్, ఆమె ప్రియుడు సాహిల్ కలిసి హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమెంట్‌తో నింపిన బ్లూ డ్రమ్‌లో దాచిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

125 ఏళ్ల చరిత్రలో ఘోరం.. వచ్చే 15 రోజుల్లో ఏం జరగనుంది?

చిత్తూరులో భారీ బంగారు గని.. సీమకు ఇక.. మంచిరోజులే.. గోల్డ్ క్యాపిటల్‌‌గా AP!

గుడ్‌న్యూస్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గాయోచ్‌!

డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా గుండె గుభేల్‌

జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

Follow Us