AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

125 ఏళ్ల చరిత్రలో ఘోరం.. వచ్చే 15 రోజుల్లో ఏం జరగనుంది?

125 ఏళ్ల చరిత్రలో ఘోరం.. వచ్చే 15 రోజుల్లో ఏం జరగనుంది?

Phani CH
|

Updated on: Jul 05, 2026 | 8:21 PM

Share

125 ఏళ్లలోనే అత్యల్ప వర్షపాతం నమోదైన జూన్ తర్వాత దేశానికి ఊరటనిచ్చే వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో వచ్చే 15 రోజులు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్‌నినో ప్రభావం తగ్గుతుండగా, అల్పపీడనాలు, తేమగాలులతో రైతులు, ప్రజలకు ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

15 రోజులు. దాదాపు రెండు వారాల పాటు మన దేశానికి చాలా అంటే చాలా కీలకం. వాతావరణ శాఖ చేసిన సంచలన ప్రకటన ఇది. అంటే ఏం జరగబోతోంది? భారీ వర్షాలు పడబోతున్నాయా? వరదలు ముంచెత్తనున్నాయా? ప్రకృతి విపత్తులు రాబోతున్నాయా? అసలేం జరగనుంది? ఒక్క ప్రకటనతో ఇన్ని ప్రశ్నలు వస్తాయి. వాటన్నింటికీ సమాధానం చూద్దాం. ఇంత బిగ్ అలెర్ట్ దేనికంటే.. మన దేశంలో వాతావరణంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వేసవి ఎండలు జూన్ నెల వరకు కంటిన్యూ అయ్యాయి. జూన్ లో వర్షాలు కురవాల్సి ఉన్నా.. ఆశించినంతగా వర్షపాతం లేదు. దీంతో ఎండ వేడి, ఉక్కపోతతో జనం నానాయాతన పడ్డారు. ఇదంతా ఎల్ నినో ఎఫెక్ట్ అనుకుంటే.. కనీసం జూలై అయినా కరుణిస్తుందా.. ముఖం చాటేస్తుందా అన్న టెన్షన్ లో రైతులతో పాటు ప్రజలంతా ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వాతావరణశాఖ స్వీట్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు రెండు వారాల పాటు దేశంలో వర్షాలు పడతాయన్నది ఆ గుడ్ న్యూస్. ఇదంతా నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్. ఇప్పటికే ఇవి.. ఉత్తర, మధ్య భారతాల్లో పూర్తిగా విస్తరించాయి. అందుకే వెదర్ మొత్తం మారిపోయింది. హాట్ వెదర్ కాస్తా కూల్ వెదర్ అయ్యింది. రుతుపవనాల వల్ల కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లో ఈ ప్రభావం కనిపిస్తోంది. రుతుపవనాలు ఇక్కడితో ఆగలేదు. నెమ్మదిగా దేశమంతా విస్తరిస్తున్నాయి. అందుకే ఈ రెండు వారాలు.. దేశానికి అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు చెప్పారు. మీకు ఇంకో విషయం చెప్పాలి. గత 125 సంవత్సరాల చరిత్రను చూస్తే.. ఒక్క విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అదేంటంటే.. 125 ఏళ్లలో అతి తక్కువ వర్షపాతం నమోదైన నెల.. గత జూన్ నెలే. అవును 2026 జూన్ నెల.. వాతావరణ శాఖ చరిత్రలో నిలిచిపోతుంది. దీని రికార్డ్ అలాంటిది. ఏకంగా 40 శాతం వర్షపాతం లోటు ఉండడంతో జూన్ నెల… ఇలాంటి నెగటివ్ క్రెడిట్ ని మూటగట్టుకుంది. రికార్డులను పరిశీలిస్తే.. 1901వ సంవత్సరం తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఇలాంటి వాతావరణం ఉన్న నెల ఏదయ్యా అంటే అది ఈ జూన్ మాసమే. అందుకే ఈ నెలలో ఉక్కపోత ఎక్కువైంది. వర్షపాతం తక్కువైంది. నీటి కష్టాలు పెరిగాయి. అలాగని.. చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదా అంటే.. ఐదు సార్లు వచ్చింది. ఆ లెక్కలు చూస్తే.. 1905, 1926, 2009, 2014, 2026.. ఈ ఐదేళ్లలో జూన్ నెలలో వర్షపాతం చాలా తక్కువగా అంటే.. 100 మిల్లీ మీటర్ల లోపే ఉంది. 1905 జూన్ లో 92.3 మిల్లీమీటర్లు, 1926 జూన్ లో 97.4 మిల్లీమీటర్లు, 2009 జూన్ లో 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి కారణం లేకపోలేదు. 2026లో ఎలా.. ఎల్‌నినో వచ్చిందో.. ఆ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఎదురైంది. 2014 జూన్‌లో 93 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవ్వడానికి కారణం కూడా ఎల్ నినోయే. ఇప్పుడు 2026 జూన్ లో కూడా ఇదే పరిస్థితి రావడానికి కారణం.. ఎల్ నినోయే. అందుకే ఈసారి దారుణాతి దారుణంగా కేవలం 40 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సో.. 125 ఏళ్లలో ఈ ఏడాది జూన్ నెలలో మన దేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొందని క్లియర్ గా అర్థమవుతుంది. పసిఫిక్ మహా సముద్రం వేడెక్కితే.. ఎల్ నినో ఏర్పడుతుంది. ఇది కాని వస్తే.. రుతుపవనాలను బలహీనపరుస్తుంది. అవి విస్తరించుకుండా అడ్డుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే.. రుతుపవనాలు టైమ్ ప్రకారం కేరళకు వచ్చేస్తాయి. కానీ అక్కడి నుంచి దేశమంతా విస్తరించకుండా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీనివల్ల దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఇవి కదలవు. దీంతో వర్షాల జాడ ఉండదు. పోనీ అల్పపీడనాలు ఏర్పడడం వల్లయినా వర్షాలు కురుస్తాయా అంటే అదీ లేదు. జూన్ లో అరేబియా సముద్రంలో కానీ, బంగాళాఖాతంలో కానీ వాయుగుండాలు, అల్పపీడనాలు ఏమీ లేవు. దీనివల్ల మేఘాలకు కావాల్సిన తేమ అందలేదు. అందుకే వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాలు పడకపోతే ఏమిటి సమస్య అనుకోవచ్చు. వర్షాలు పడితేనే.. భూగర్భజలాలు పెరుగుతాయి. డ్యాములు నిండుతాయి. సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. ఒక్క ఏడాది వర్షాలు కురవకపోతే పరిస్థితి మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు జరుగుతోంది ఇదే. కానీ ఇలాంటి సందర్భంలోనూ వరుణుడు కాస్త కనికరించాడు. అందుకే ఇంత కష్టంలోనూ ఒక గుడ్ న్యూస్ గురించి చెప్పుకోవాలి. ఇప్పుడున్న వాతావరణం ప్రకారం చూస్తే.. ఒకేసారి రెండు అల్పపీడనాల వల్ల సీన్ మారేలా కనిపిస్తోంది. దీని వల్ల వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు వాతావరణ నిపుణులు. వీటికి తోడు రుతుపవనాల విస్తరణ కూడా వానలు ఎక్కువగా కురవడానికి కారణమవుతోంది. అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతం.. ఈ రెండింటి నుంచి దేశంలోకి తేమతో కూడిన గాలులు వస్తున్నాయి. దీని ఎఫెక్ట్ బలంగా పని చేస్తుండడంతో వర్షాలు పడడానికి అంతా అనుకూలంగా మారింది. అందుకే ఢిల్లీలో ఎంటరై.. ముంబైని ముంచెత్తాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఢిల్లీలో అయితే గత నెల 27కే రుతుపవనాలు ప్రవేశించాలి. కానీ జూలై 3 వరకు వాటి జాడే లేదు. ఇప్పుడైతే ఆకాశం మేఘావృతమైంది. భారీవర్షాల అలెర్ట్ కూడా వచ్చేసింది. గుజరాత్​, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్​, హర్యానా, పంజాబ్​, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రుద్ర ప్రయాగ్ లో హైఅలెర్ట్ అనౌన్స్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఇప్పటికే వర్షాల వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి వాతావరణం ఆందోళన కలిగించేలానే ఉంది. ఎందుకంటే ఎగువ హిమాలయ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అలకనంద, మందాకిని నదుల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, నదుల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరువైన వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా వెంటనే హెచ్చరికలు పంపడంతో పాటు, వాహనాల ద్వారా మైకింగ్ నిర్వహిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో సిబ్బందిని పంపించి నదీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా హెచ్చరిస్తారు. శనివారం నాడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్సుంది. అందుకే ఇన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని డ్యాముల పరిస్థితి చూస్తే.. చాలావరకు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి. సో.. ఇప్పుడు వర్షాలు పడితేనే.. మళ్లీ వీటికి జలకళ వస్తుంది. అప్పుడే సాగు, తాగునీటి కష్టాలకు చెక్ పడుతుంది. ఇక వర్షం ప్రాధాన్యత అంటే ఏమిటో అన్నదాతకు తెలుస్తుంది. ఎందుకంటే.. చినుకు రాలితేనే పంట పడుతుంది. దీనికి కారణం.. మన దేశంలో వ్యవసాయరంగంలో దాదాపు 60 శాతం వర్షాధారమే. వాన కురవకపోతే చిరుధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాల సాగుకు సమస్యలు తప్పవు. వర్షం కురవాల్సిన దాని కన్నా.. ఏమాత్రం తగ్గినా.. అది ఆహార భద్రతకు సవాలే. ఎందుకంటే వాన లేకపోతే పంట పండదు. పంట లేకపోతే.. ఆహార భద్రత ఎక్కడుంటుంది? ఇదే సమయంలో రైతుల ఉపాధి పైనా దెబ్బపడుతుంది. 2021-2022లో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. దీనివల్ల మన దేశం.. బియ్యంలో కొన్ని రకాల పైనా, గోధుమల పైనా, షుగర్ పైనా కొన్నాళ్లపాటు నిషేధాన్ని విధించాల్సి వచ్చింది. సో.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలలో ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టాలి. భూమిలోకి ఇంకేలా చేయాలి. భూగర్భజలాలు పెరిగేలా చేయాలి. ఎక్కడికక్కడ జలం ఉంటే.. అప్పుడు సాగు, తాగు నీటి కష్టాలు తీరుతాయి. వీలైనన్ని చోట్ల మొక్కలను పెంచాలి. నదుల అనుసంధానం గురించి ప్రభుత్వాలు సీరియస్ గా ఆలోచించాలి. పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. కఠిన నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే వాన కష్టాలను ఎదుర్కొనే జలశక్తి వస్తుంది. నీటి కష్టాలకు చెక్ పడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిత్తూరులో భారీ బంగారు గని.. సీమకు ఇక.. మంచిరోజులే.. గోల్డ్ క్యాపిటల్‌‌గా AP!

గుడ్‌న్యూస్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గాయోచ్‌!

డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా గుండె గుభేల్‌

జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

Follow Us