AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

Phani CH
|

Updated on: Jul 05, 2026 | 4:52 PM

Share

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఉన్న బాబు మహారాజ్ ఆలయంలో దొంగలు 70 కిలోల బరువైన రెండు ఇత్తడి గంటలను చోరీ చేశారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి కట్టర్‌తో గొలుసులు కత్తిరించి గంటలను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. తరచూ దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పూజారి, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దొంగలు మరీ బరితెగించిపోతున్నారు.. పోలీసుల మాటెలా ఉన్నా.. కనీసం దేవుడికి కూడా భయపడటంలేదు. ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ ఆథ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆలయాల్లో హుండీలను చోరీ చేసిన వాళ్లను చూశాం. ఇప్పుడు ఆలయ పరిసరాల్లో వేళాడే గంటలపైన పడ్డారు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా సైంపౌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రసిద్ధ ‘బాబు మహారాజ్ ఆలయం’లో దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని దుండగులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడి సుమారు 70 కేజీల బరువైన రెండు ఇత్తడి గంటలను దొంగిలించుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలన్నీ ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అర్ధరాత్రి సుమారు 1:15 గంటల సమయంలో ముఖాలకు గుడ్డలు కట్టుకుని వచ్చిన ఇద్దరు దుండగులు, కట్టర్ సహాయంతో గంటల గొలుసులను, వైర్లను కత్తిరించి బస్తాల్లో నింపుకుని పారిపోయారు. అయితే, ఈ ఆలయంలో దొంగతనం జరగడం ఇది మొదటిసారి కాదని పూజారి రూప్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇక్కడ గంటలు చోరీకి గురయ్యాయని, ఆలయ ప్రాంగణం నుండి తన మోటార్ సైకిల్ కూడా ఎత్తుకెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. పదే పదే దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని పూజారి, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఉదాసీనత వల్లే దొంగలు మరింతగా రెచ్చిపోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?

బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..

ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!

నాడు ఏకే-47 పట్టిన చేతులతోనే.. నేడు నాగలిపట్టి సేద్యం

Samantha: బేబీ బంప్‌తో సమంత వర్కౌట్స్.. ఫిట్‌ నెస్‌ విషయంలో నో కాంప్రమైజ్‌

Follow Us