రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?
విశాఖ రుషికొండపై రూ.452 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రపంచ స్థాయి టూరిజం, హాస్పిటాలిటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీటीडీసీ ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ఈఓఐ విడుదల చేయగా, ఐదు బ్లాకుల నిర్వహణను లీజుకు ఇవ్వనుంది. ప్రజల సందర్శనకు వ్యూయింగ్ ఏరియాలు, ఓపెన్ స్పేస్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖపట్నంలోని రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 452 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన విలాసవంతమైన భవనాల భవితవ్యం ఎట్టకేలకు తేలింది. ఈ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలుగా కాకుండా, ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ మరియు టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ , లీజ్ మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ‘ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా భవనాలను పర్యాటక పరంగా వినియోగిస్తూనే, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కొండపై 9.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐదు బ్లాకుల నిర్మాణాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. వీటితో పాటు కొండ దిగువన ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా సీఆర్‌జెడ్ నిబంధనలకు లోబడి హోటళ్లు, రిసార్టుల నిర్మాణాలతో సమగ్ర టూరిజం జోన్‌గా అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించారు. కొండపై ఉన్న భవనాలతో పాటు 1,200 చదరపు మీటర్ల ఖాళీ స్థలంలో, గరిష్టంగా 4,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ+1 భవనాలు నిర్మించుకునేందుకు ఏపీటీడీసీ అనుమతించింది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేట్ పరమవకుండా, సాధారణ ప్రజల సందర్శనార్థం వ్యూయింగ్ ఏరియాలు, ప్రొమెనేడ్లు, ఓపెన్ కల్చరల్ స్పేస్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిబంధన విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రత్యేక మంత్రుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనలు, స్టేక్‌హోల్డర్ల అభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ అంతర్జాతీయ స్థాయి టూరిజం ప్రాజెక్టుపై ఆసక్తి ఉన్న ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు, హోటల్ చైన్లు జులై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ భవనాలపై సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉత్కంఠకు పూర్తిగా తెరపడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!
నాడు ఏకే-47 పట్టిన చేతులతోనే.. నేడు నాగలిపట్టి సేద్యం
Samantha: బేబీ బంప్‌తో సమంత వర్కౌట్స్.. ఫిట్ నెస్ విషయంలో నో కాంప్రమైజ్
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!
విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు
దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా?
పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం
మానవత్వం చాటుకున్న టీచర్ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.
వాషింగ్ మెషిన్లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..!
