AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!

ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!

Phani CH
|

Updated on: Jul 05, 2026 | 4:36 PM

Share

భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ దాడులు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముప్పుగా పేర్కొంది. బ్యాంకులు క్లౌడ్, ఏఐ సేవలపై అధికంగా ఆధారపడటం, సైబర్ భద్రతలో ఉన్న లోపాలు ఆందోళనకరమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కఠినమైన సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేసేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది.

దేశ ఆర్థిక వ్యవస్థకు సంప్రదాయ ముప్పులైన ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కంటే.. వేగంగా విస్తరిస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ సాంకేతికతే అత్యంత ప్రమాదకరంగా మారిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. తాజాగా విడుదల చేసిన జూన్ 2026 నాటి ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్’లో ఆర్‌బీఐ ఈ విషయాలను వెల్లడించింది. ఆర్థిక రంగంలో ఏఐ వల్ల పనితీరు మెరుగైనప్పటికీ, వ్యవస్థ భద్రతకు ఇది పెద్ద సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే 12 నెలల్లో దేశ ఆర్థిక సంస్థలకు ఎదురయ్యే ముప్పులలో ‘ఏఐ ఆధారిత సైబర్ దాడులే’ అత్యంత ప్రమాదకరమైనవని నివేదిక స్పష్టం చేసింది. సాధారణ హ్యాకింగ్, రాన్సమ్‌వేర్ల కంటే ఏఐ సాయంతో జరిగే దాడులు ఊహించని స్థాయిలో వ్యవస్థలను అతలాకుతలం చేస్తాయని, ఇటీవలి ‘మైథోస్ రాన్సమ్‌వేర్’ దాడే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. దీనితో పాటు, మెజారిటీ బ్యాంకులు కేవలం కొన్ని క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ ప్రొవైడర్లపైనే ఆధారపడటం వల్ల ఒకేసారి వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. డేటా గవర్నెన్స్ లోపాలు, సాంకేతిక ముప్పులను ఎదుర్కోవడంలో బ్యాంకుల అరకొర సంసిద్ధతను ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో సైబర్ భద్రతకు బ్యాంకులు బడ్జెట్‌ను పెంచుకుంటుండగా, ఆర్‌బీఐ సైతం త్వరలోనే అత్యంత కఠినమైన ‘ఫైనాన్షియల్ సెక్టార్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ’ని అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాడు ఏకే-47 పట్టిన చేతులతోనే.. నేడు నాగలిపట్టి సేద్యం

Samantha: బేబీ బంప్‌తో సమంత వర్కౌట్స్.. ఫిట్‌ నెస్‌ విషయంలో నో కాంప్రమైజ్‌

స్వీట్‌ షాపులో కరకరలాడే మిక్చర్‌ తింటున్నారా.. జాగ్రత్త!

Follow Us