ఢిల్లీలో FSSAI తనిఖీల్లో నకిలీ ఎక్స్పైరీ డేట్లతో అమ్ముడవుతున్న 40 వేలకు పైగా ఆహార ఉత్పత్తులు పట్టుబడ్డాయి. కెమికల్స్‌తో పాత డేట్లను తొలగించి, కొత్త డేట్లు ప్రింట్ చేస్తున్నారు. వీటితో ఫుడ్ పాయిజనింగ్, స్టమక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వినియోగదారులు సీల్, ప్రింటింగ్ నాణ్యతను కూడా తప్పక తనిఖీ చేయాలి.