AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు

ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు

Phani CH
|

Updated on: Aug 15, 2026 | 4:50 PM

Share

గుప్త నిధుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని నమ్మించి 11 మంది నుంచి ఏకంగా రూ.కోటి వరకు వసూలు చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా గుంతలు తీయించి అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలు పెట్టి పూజలు చేసినట్లు నటించేవారు. పోలీసులు నిందితుల నుంచి నకిలీ నాణేలు, బొగ్గు, వాహనాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

గుప్త నిధులు అని నమ్మించారు. పూజ చేస్తే కోట్లు కురుస్తాయన్నారు. అది కూడా బొగ్గు, మట్టి ఉంటే చాలు.. మీ జీవితాలనే మార్చేస్తా అంటూ మాయమాటలు చెప్పారు. అలా నమ్మించి ప్రజల నుంచి కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్ల ఆటలను.. చివరకు పోలీసులు కట్టించి కటకటాల్లోకి నెట్టేశారు. గుప్త నిధుల గుట్టు విప్పుతా.. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా అంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ పోలీసుల ఆపరేషన్‌లో ఈ ముఠా లీలలు వెలుగుచూశాయి. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ బాధితులకు మాయమాటలు చెప్పిన నిందితులు.. 11 మంది నుంచి రూ. కోటి రూపాయల వరకు వసూలు చేశారు. బాధితులతో గుంతలు తీయించి అందులో ముందుగానే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేల సంచులను పెట్టి పూజ చేసినట్టు నటించేవారు. బొగ్గు బంగారంగా మారేందుకు సమయం పడుతుందంటూ చెప్పి అక్కడి నుంచి ఉడాయించేవారు. ఆ తర్వాత మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం బయటపడింది. అలా గుప్త నిధుల పేరుతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడుతుంటడంతో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆటో, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణేలను సీజ్‌ చేశారు. ఆరు కిలోల బొగ్గు, నాలుగు కిలోల మట్టి, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న మునావర్‌పై గతంలోనూ చీటింగ్‌ కేసు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గుప్త నిధుల పేరుతో ఎవరైనా వస్తే నమ్మొద్దన్న పోలీసులు.. తమకు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు

Monsoon Update: పసిఫిక్‌లో ఎల్‌నినో సెగ.. భారత్‌లో నిలకడగా రుతుపవనాలు.. కరువు భయం లేనట్లే!

Follow Us