ప్రెజెంట్ యూత్ కి ప్రియాంక జైన్ అంటే తెలియని వారుండరు. బిగ్ బాస్ సీజన్-7 తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
జానకీ కలగనలేదు, మౌన రాగం వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై పాపులరిటీ తెచ్చుకుంది
ఇక ఆ తరువాత తెలుగు బిగ్ బాస్ సీజన్-7 హౌస్‌లోకి ప్రవేశించాక.. మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సీజన్ 7లో అందరికి వండి పెడుతూ.. సందడి చేస్తూ.. తన ఆటతో టాప్ 5లో నిలిచి అందరిని ఆకట్టుకుంది ప్రియాంక జైన్
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది వారి ప్రేమ గురించి అందరికి చెప్పింది.
తాను సీరియల్స్ ఎందుకు వదిలేశానో చెబుతూ.. ‘సీరియల్స్ చేస్తే ఒకే రకమైన పాత్రలో బందీ అయిపోతానేమో అన్న భయం నన్ను వెంటాడింది.
పైగా సీరియల్స్ వల్ల డేట్స్ అడ్జెస్ట్ అవ్వవు, వేరే ప్రాజెక్ట్ చేయడానికి సమయం దొరకదు. నటిగా కేవలం సీరియల్ క్యారెక్టర్లకే పరిమితం అయిపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ప్రియాంక స్పష్టం చేసింది.