AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటో తెలిస్తే..

అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటో తెలిస్తే..

Phani CH
|

Updated on: Jul 07, 2026 | 4:48 PM

Share

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా ఖిరియా మౌ సహా కొన్ని గ్రామాల్లో శతాబ్దాల నాటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆవు మరణం లేదా ఇతర అశుభ సంఘటనలు జరిగితే గ్రామంలో వివాహాలు నిర్వహించరాదు అనే నమ్మకాన్ని ప్రజలు కచ్చితంగా పాటిస్తున్నారు. ఖిరియా మౌలో ఈ కారణంగా ఏకంగా 12 ఏళ్ల పాటు ఒక్క పెళ్లి కూడా జరగకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

సాంకేతిక రంగంలో ప్రపంచం ఎంత దూసుకెళ్తున్నా.. భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో శతాబ్దాల నాటి ఆచారాలను ప్రజలు ఇప్పటికీ కచ్చితంగా పాటిస్తున్నారు. అలాంటి ఒక అరుదైన, విచిత్రమైన సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా పరిధిలోని ఖిరియా మౌ, కొలువా, టక్నేరి వంటి గ్రామాల్లో కొనసాగుతోంది. ఈ గ్రామాల్లో ఆవు మరణించినా, లేదా ఏదైనా ఇతర అశుభ సంఘటన జరిగినా కొంతకాలం పాటు ఊరి పొలిమేరల్లో ఎలాంటి శుభకార్యాలు కానీ, ముఖ్యంగా వివాహాలు జరపకూడదనే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఖిరియా మౌ గ్రామంలో కొన్నాళ్ల కిందట ఒక వాహనం ఢీకొని ఆవు చనిపోయిందట. గ్రామ పెద్దలు దీనిని అశుభంగా భావించి ఊరిలో పెళ్లిళ్లను నిషేధించారట. ఆ తర్వాత వరుసగా జరిగిన ప్రమాదాల్లో ఒక ఇంజినీర్, ఒక చిన్నారి మరణించడంతో ఈ నిషేధం ఏకంగా 12 ఏళ్ల పాటు కొనసాగింది. ఫలితంగా ఈ 12 సంవత్సరాలలో గ్రామంలో ఒక్కటంటే ఒక్క పెళ్లి కూడా జరగలేదట. అలా అని గ్రామస్థులు ఎవరూ పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్నారా అంటే.. అదేం లేదు. తమ పిల్లల వివాహాలను గ్రామ సరిహద్దులు దాటి.. పొలాల్లోనో, పక్క ఊర్లలోనో లేదా పట్టణాల్లోనో నిర్వహించేవారు. కూతుళ్ల అప్పగింతలు కూడా ఊరి బయటి నుంచే జరిపించి అత్తింటికి పంపేవారు. గ్రామ పెద్దల నిర్ణయానికి కట్టుబడి, శతాబ్దాల నాటి ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్న ఈ గ్రామస్థుల తీరు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!

నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర

రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..

రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం

Follow Us