AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా

Phani CH
|

Updated on: Jul 07, 2026 | 4:20 PM

Share

తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలపైనే వరుడు నాగేంద్రకు బీఎల్‌ఓ ఓటరు నమోదు ఫారం అందించగా, వెంటనే వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించాడు. ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పిన ఈ సంఘటన అతిథులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

తెలంగాణలో ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. ఓటర్ల నమోదులో ఎలాంటి తప్పులు జరగకుండా రాజకీయ పార్టీలు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు గెడ్డం మహాలక్ష్మి-బజారు దంపతుల కుమారుడు నాగేంద్రకు, లక్ష్మీ స్వాతితో వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలోనే.. అక్కడ కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బూత్ లెవల్ అధికారి నేరుగా వివాహ వేదికపైకే వెళ్లారు. పెళ్లి పీటలపై ఉన్న నూతన వరుడు నాగేంద్రకు ఓటరు నమోదు ఫామ్‌ను అందజేశారు. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ , పెళ్లి పీటలపైనే స్వయంగా వరుడి వివరాలను నమోదు చేసి, ఫామ్‌ను పూర్తి చేయించారు. అనంతరం ఆ ఫామ్‌ను అక్కడే బీఎల్‌ఓకు అందజేశారు. పెళ్లి హడావుడిలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతగల పౌరుడిగా వరుడు పెళ్లి పీటలపైనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం. ఓటు హక్కు విలువను తెలియజేస్తూ పెళ్లి వేడుక మధ్యలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం అక్కడికి వచ్చిన అతిథులందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర

రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..

రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం

వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!

వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!

Follow Us