బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు పెద్ద కొండచిలువతో పాటు పలు పాములను అక్రమంగా పెంచుతున్నాడు. వింత శబ్దాలు, మాంసం సరఫరా గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అటవీశాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని యువకుడిపై కేసు నమోదు చేశారు.