వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా నెర్ల గ్రామంలోని ఓ ఇంట్లో ఏకంగా 40 నాగుపాము పిల్లలు కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రతన్ కుంభారే బృందం వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించింది. అనంతరం అన్ని పాము పిల్లలను వాటి సహజ ఆవాసంలో విడిచిపెట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను స్థానికులు, అధికారులు ప్రశంసించారు.
ఒక్క పాము కనిపిస్తేనే గుండె గుభేల్మంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో ఏకంగా 40 నాగుపాములు ప్రత్యక్షమైతే? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ భయానక ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. రామ్‌టెక్ సమీపంలోని నెర్ల గ్రామానికి చెందిన రాజు ధోమనే అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా 40 నాగుపాము పిల్లలు కలకలం సృష్టించాయి. ఇల్లంతా పాము పిల్లలు ప్రాకుతుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు అటవీశాఖకు, స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే చాచర్‌లోని ‘వైల్డ్ ఛాలెంజర్’ సంస్థకు చెందిన స్నేక్ క్యాచర్ రతన్ కుంభారే తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యంత నైపుణ్యంతో ఆ 40 నాగుపాము పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. ఆ తర్వాత వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల ప్రకారం, రామ్‌టెక్ అటవీ శాఖ కార్యాలయంలో ACF గోవింద్ కుమార్ లుచే, రేంజ్ ఆఫీసర్ రాహుల్ షిండే సమక్షంలో ఆ పాము పిల్లలన్నింటినీ అటవీ ప్రాంతంలోని వాటి సహజ ఆవాసాలలో సురక్షితంగా విడిచిపెట్టారు. సమయస్ఫూర్తితో 40 విషసర్పాల ప్రాణాలు కాపాడిన రతన్ కుంభారే బృందాన్ని అటవీ అధికారులు, స్థానికులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. గ్యాస్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్, ఎగ్స్ ధర
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

