స్టార్ క్రికెటర్ రిలేషన్‌షిప్‌పై రాయ్ లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు
07-07-2026
Pic credit - Instagram
Phani Ch
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. 2005లో 'కర్క కసదర' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. హీరోయిన్‌గా కంటే తన గ్లామరస్ పాత్రలకే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.
తన కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత స్టార్ అయ్యింది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది.
చాలా మంది స్టార్ హీరోలతో నటించింది అంతే కాదు ఓ స్టార్ క్రికెటర్ తో రిలేషన్ షిప్ కూడా నడిపింది. గతంలో ఆ స్టార్ క్రికెటర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో కూడా నిలిచింది.
ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, ధోనితో ఉన్న బంధం తన జీవితంలో ఒక "మచ్చ" లా మిగిలిపోయిందని రాయ్ లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
గతంలో ధోనితో తనకు సంబంధం ఉందని వచ్చిన వార్తలను తాజాగా తవ్వి తీస్తున్నారని, ఇంటర్నెట్‌లో ఈ విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయని రాయ్ లక్ష్మీ అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రచారాన్ని దూరం పెట్టాలని కోరింది.