AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా

తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు అందిస్తున్న వానాకాలం పెట్టుబడి సాయం మరో విడత నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ విడతలో 7 నుంచి 8 ఎకరాల సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో మొత్తం రూ.259.73 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా
Rythu Bharosa Funds Released
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 07, 2026 | 6:35 PM

Share

రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద మరో విడత నిధులను విడుదల చేసింది. ఈసారి 7 నుంచి 8 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయాన్ని జమ చేసింది.ఈ విడతలో 58,831 మంది రైతులు లబ్ధి పొందారు. వీరికి చెందిన 4.32 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి మొత్తం రూ.259.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దశలవారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 6 విడతల్లో 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందించగా, ఇప్పుడు 7 నుంచి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. రైతుభరోసా అమలు ప్రారంభమైన తర్వాత కేవలం ఏడు రోజుల్లోనే రూ.7,750.45 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక భరోసా కల్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 68.96 లక్షల మంది రైతులకు రైతుభరోసా సాయం అందింది. మొత్తం 129.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి రూ.7,750.45 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us