AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు, కాలేజీలు! ఓపెనింగ్ ఎప్పుడంటే?

హైదరాబాద్ నగరంలోని మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రధానమంత్రి జన్‌ వికాస్ కార్యక్రమం (PMJVK) హైదరాబాద్‌లో దాదాపు రూ.33 కోట్ల నిధులతో అత్యాధునిక స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్ భవనాల నిర్మాణించింది. ఇవి త్వరలోనే విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి.

Hyderabad: విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు, కాలేజీలు! ఓపెనింగ్ ఎప్పుడంటే?
Hyderabad Minority Schools
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 07, 2026 | 7:22 PM

Share

హైదరాబాద్‌లోని మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో నగరంలోనిపలు ప్రాంతాల్లో అత్యాధుని వసతులతో స్కూల్, కాలేజీ, హాస్టల్స్‌ను ఏర్పాటు చేసింది. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తేనుంది. మైనార్టీ వర్గాల సామాజిక, విద్యా రంగాల అభివృద్ధికి, ముఖ్యంగా బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరంలోని వివిధ కీలక ప్రాంతాలలో విద్యా సంస్థలు,హాస్టల్స్ నూతన భవనాలు నిర్మించారు.

సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న మోదీ ప్రభుత్వం, మైనార్టీ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ మౌలిక వసతులను కల్పించింది. ముఖ్యంగా నాంపల్లి, బజార్‌ఘాట్ వంటి మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బాలికల విద్యా సంస్థలు, హాస్టళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లిం, ఇతర మైనార్టీ విద్యార్థినుల డ్రాపౌట్ రేటు గణనీయంగా తగ్గుతుందని, వారి ఉన్నత చదువులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది విద్యాశాఖ,కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్కూల్‌, కాలేజ్, హాస్టల్స్ ఇవే

  • మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్: నగరంలోని షేక్‌పేట్ మండలం పరిధిలోని ఇబ్రహీంబాగ్, గోల్కొండ ప్రాంతంలో 20 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మించారు.
  • మైనారిటీ బాలికల హాస్టల్ భవనం: ఇక నాంపల్లి మండలం బజార్‌ఘాట్ ప్రాంతంలో విద్యార్థినుల వసతి కోసం 4.5 కోట్లతో సురక్షితమైన, అత్యాధునిక హాస్టల్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు.
  • మైనారిటీ బాలికల జూనియర్ కాలేజీ: నాంపల్లిలో మైనార్టీ విద్యార్థినుల విద్యావకాశాలను మెరుగుపరిచేందుకు 4.25 కోట్ల వ్యయంతో జూనియర్ కాలేజీ భవనాన్ని నిర్మించారు.
  • మైనారిటీ బాలికల జూనియర్ కాలేజీ: బజార్‌ఘాట్ (నాంపల్లి మండలం) ప్రాంతంలో మరో మహిళా జూనియర్ కాలేజీ భవనాన్ని 4.25 కోట్ల నిధులతో నిర్మించారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే