AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranganath: హైకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఏమన్నారంటే..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్‌ బాధ్యతల నుంచి రంగనాథ్‌ను తొలగించాలని.. ఆయన స్థానంలో అర్హులైన అధికారిని నియమించాలని సీఎస్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ ఆదేశాలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తాము రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని ప్రభుత్వ ఆస్తులు కాపాడడమే తమ లక్ష్యమన్నారు.

Ranganath: హైకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఏమన్నారంటే..
Hydra Commissioner Ranganath Responds To Hc Orders
Anand T
|

Updated on: Jul 27, 2026 | 9:23 PM

Share

హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రంగనాథ్ స్పందించారు. తాము రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని, చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటివరకు సుమారు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి, వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని, ఇటీవల లోతుకుంటలో భూకబ్జా యత్నాన్ని కూడా అడ్డుకుందని తెలిపారు.

ఆక్రమణల తొలగింపుతో పాటు ఇప్పటికే 6 చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ల్యాండ్ మాఫియా కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని, తనపై ఉన్న కోర్టు ధిక్కార కేసులన్నీ భూకబ్జాదారులు వేసినవేనని ఆరోపిస్తూ, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. ఆ కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన అన్నారు.

ప్రభుత్వం ఏం చేయబోతుంది?

హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందనే అంశంపైనే అందరి దృష్టి నెలకొంది. హైడ్రా కమిషనర్‌గా దాదాపు రెండేళ్ల నుంచి కొనసాగుతూ వచ్చిన రంగనాథ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే విషయంలో సస్పెన్స్‌గా మారింది. అయితే హైకోర్టు ఆదేశాలపై ఆచితూచి స్పందించాలని ప్రభుత్వం నభావిస్తోంది. రంగనాథ్ విషయంలో వేచి చూసే ధోరణిలో ముందుకు సాగాలని యోచిస్తోంది. తీర్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఆధారంగా న్యాయసలహా తీసుకోవాలని డిసైడయ్యింది.

ఇక ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఇంటలిజెన్స్ చీఫ్. దీనిపై న్యాయసలహా తీసుకోవాలని సీఎస్‌కు సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక హైడ్రాపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులపై సీఎస్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో సింగిల్ బెంచ్‌ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లడంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us