AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న జైస్వాల్, నిన్న అభిషేక్.. ఆ ఒక్కడి దెబ్బకు ఇలా బలయ్యారేంది.. ఇక ఓపెనర్లుగా కష్టమేనా?

Team India Openers: టీమిండియా యువ ఆటగాళ్ల మధ్య పెరుగుతున్న ఈ ఆరోగ్యకరమైన పోటీ భారత జట్టును మరింత బలోపేతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అభిషేక్ శర్మ తన తప్పులను దిద్దుకుని త్వరగా ఫామ్‌లోకి రాకపోతే జట్టులో కొనసాగడం కష్టతరంగా మారుతుంది.

మొన్న జైస్వాల్, నిన్న అభిషేక్.. ఆ ఒక్కడి దెబ్బకు ఇలా బలయ్యారేంది.. ఇక ఓపెనర్లుగా కష్టమేనా?
Abhishek Sharma Yashavi Jaiswal
Venkata Chari
|

Updated on: Jul 27, 2026 | 9:23 PM

Share

Team India Openers: భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. పదిహేనేళ్ల వయసులో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో మరో యువ సంచలనం అభిషేక్ శర్మ కెరీర్ ప్రమాదంలో పడింది. జింబాబ్వే టూర్‌లో వైభవ్ అదరగొడుతుండగా.. వరుస వైఫల్యాలతో అభిషేక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.

చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ..

ఐపీఎల్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాలోకి అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తాజా సిరీస్‌లో మాత్రం ఈ టీనేజ్ సెన్సేషన్ రెచ్చిపోయాడు. ఆఖరి టీ20 మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఏకంగా 81 పరుగులు బాదేశాడు. ఈ సిరీస్‌లో వైభవ్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. కేవలం పదిహేనేళ్ల వయసులో రెండు అంతర్జాతీయ అర్ధశతకాలు బాదిన రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనంగా మారాడు. మైదానంలో అతడు చూపుతున్న దూకుడు చూసి దిగ్గజాలు సైతం అవాక్కవుతున్నారు.

ఇది కూడా చదవండి: చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

తీవ్ర నిరాశపరుస్తున్న అభిషేక్ శర్మ..

మరోవైపు ఇదే సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అభిషేక్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లలోనూ అతను కనీసం సింగిల్ డిజిట్ స్కోరును కూడా దాటలేకపోయాడు. మూడో మ్యాచ్‌లో బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్ లో కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో అత్యంత తక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఎనిమిది బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రెండో మ్యాచ్‌లో రెండు ఫోర్లు బాది కాస్త కుదురుకున్నట్టే కనిపించినా అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఒకే బౌలర్ బౌలింగ్‌లో పదే పదే అవుట్ కావడం పట్ల అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భయపెడుతున్న వైభవ్ దూకుడు..

తనకంటే చిన్నవాడైన వైభవ్ సూర్యవంశీ బౌలర్లను చెడుగుడు ఆడుతుంటే.. అభిషేక్ శర్మపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తాను కూడా అంతే వేగంగా ఆడాలనే కసితో త్వరగా వికెట్లు ఇస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ రూపంలో వచ్చిన ఈ గట్టి పోటీ అభిషేక్‌ను తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టేసింది. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇకపై భారీ ఇన్నింగ్స్‌లు ఆడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇదే వైఫర్యం కొనసాగితే తుది జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. సంజు శాంసన్ లాంటి సీనియర్లు బెంచ్‌పై వేచి చూస్తుండటంతో అభిషేక్ కెరీర్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకం కానున్నాయి.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us