AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

ISSF World Cup 2026: అంతర్జాతీయ వేదికలపై భారతీయ మహిళా షూటర్లు మరోసారి తమ విశ్వరూపం ప్రదర్శించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ షూటర్ ఈషా సింగ్ ఇదే జోరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని ప్రతిష్టాత్మక పతకాలు దక్కడం ఖాయం.

చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
Esha Singh Won Gold And Manu Bhaker Bagged Bronze
Venkata Chari
|

Updated on: Jul 27, 2026 | 3:36 PM

Share

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత క్రీడాకారిణులు అద్భుతం సృష్టించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాద్ యువ సంచలనం ఈషా సింగ్ ఏకంగా స్వర్ణ పతకం కొల్లగొట్టి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఇదే ఈవెంట్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఉత్కంఠ పోరులో కాంస్యంతో మెరిసింది.

ఫైనల్లో అదరగొట్టిన ఈషా సింగ్..

హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యువ క్రీడాకారిణి ఈషా సింగ్ షూటింగ్ రేంజ్‌లో తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఏకాగ్రతతో ఆమె గురి తప్పకుండా కాల్పులు జరిపింది. మొత్తం 40 హిట్స్ నమోదు చేసిన ఈ తెలుగమ్మాయి.. తన సమీప ప్రత్యర్థి, చైనాకు చెందిన ఝాంగ్ యుయుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చైనా షూటర్ 37 పాయింట్లకే పరిమితం కావడంతో నేరుగా పసిడి పతకం ఈషా మెడలో పడింది. ఈ సీజన్‌లో ఈషా ఖాతాలో చేరిన రెండో వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ ఇది. మే నెలలో మ్యూనిచ్ వేదికగా జరిగిన టోర్నీలోనూ ఆమె ఏకంగా ప్రపంచ రికార్డులతో స్వర్ణం సాధించిన విషయం క్రీడాభిమానులకు ఇంకా గుర్తే ఉంది.

ఒత్తిడిని జయించి.. అంచనాలను అందుకుని..

గతంలో సాధించిన వరల్డ్ రికార్డుల కారణంగా తనపై విపరీతమైన ఒత్తిడి ఉండిందని ఈషా సింగ్ మ్యాచ్ అనంతరం పంచుకుంది. ఒక క్రీడాకారిణిగా విజయాలు సాధిస్తున్న కొద్దీ అంచనాల భారం పెరుగుతుందని ఆమె వ్యాఖ్యానించింది. ఆ మానసిక ఒత్తిడిని అధిగమించి ఈ పతకం సాధించడం తనకు చెప్పలేనంత సంతోషాన్నిస్తోందని స్పష్టం చేసింది. గత ఆసియా క్రీడల్లో ఇదే హాంగ్జౌ వేదికపై ఏకంగా నాలుగు పతకాలు నెగ్గిన మధుర స్మృతులను ఆమె గుర్తు చేసుకుంది. ఇక్కడి వాతావరణం, లైటింగ్ తనకు బాగా కలిసొచ్చాయని ఆనందం వ్యక్తం చేసింది.

ఉత్కంఠ పోరులో మను భాకర్‌కు కాంస్యం..

పారిస్ ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన స్టార్ షూటర్ మను భాకర్ ఈ టోర్నీలోనూ తన మార్క్ చూపించింది. ఫైనల్లో అడుగడుగునా ఆమె తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అత్యంత కీలకమైన డబుల్ షూట్-ఆఫ్‌లో తన అపార అనుభవాన్ని ఉపయోగించి 28 హిట్స్ నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఉత్తర కొరియా షూటర్ పాక్ హ్యోన్ గ్యోంగ్‌ను వెనక్కి నెట్టి కాంస్య పతకాన్ని తన సొంతం చేసుకుంది. భవిష్యత్తులో జరగబోయే ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ఈ పతకం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని మను భాకర్ ధీమా వ్యక్తం చేసింది.

క్వాలిఫికేషన్‌లోనూ మనవాళ్లదే పూర్తి ఆధిపత్యం..

పతకాల పోరుకు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్లు ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. మను భాకర్ 586 పాయింట్లతో ఏకంగా మొదటి స్థానంలో నిలవగా.. ఈషా సింగ్ 585 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. ఇద్దరూ ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. వీరితో పాటు బరిలోకి దిగిన మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత రాహీ సర్నోబత్ 582 స్కోరు సాధించినా తృటిలో ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సైన్యం విజ్ రజతం గెలుచుకుంది. ఈనాటి ఈషా స్వర్ణం, మను కాంస్యంతో కలుపుకుని పట్టికలో భారత పతకాల సంఖ్య మొత్తం మూడుకు చేరుకుంది.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..