AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana 2022: జూన్ 5న తెలంగాణ బీసీ విద్యాసంస్థల్లో డిగ్రీ, ఇంటర్ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్

డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరే బీసీ విద్యార్థులకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(MJPTBCWREIS)..

Telangana 2022: జూన్ 5న తెలంగాణ బీసీ విద్యాసంస్థల్లో డిగ్రీ, ఇంటర్ ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్
stuent
Follow us
Srilakshmi C

|

Updated on: May 26, 2022 | 1:02 PM

TS BC Degree, Inter Entrance Exam on June 5th: డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరే బీసీ విద్యార్థులకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(MJPTBCWREIS) కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం 51,905 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో ఇంటర్ కోర్సుల కోసం 45,735 మంది దరఖాస్తు చేసుకోగా, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6,170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. వీరందరికీ వారి వారి జిల్లా కేంద్రాల్లో జూన్ 5న (Entrance Test Date) పరీక్ష నిర్వహిస్తామని మల్లయ్య బట్టు తెలిపారు.బిసీ సంక్షేమ గురుకుల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం జూన్ 2లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 19న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలను mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. లేదా 040-23322377, 23328266 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.