Nirmal: నిర్మల్ మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీని రద్దుచేస్తున్నట్లు సర్కార్‌ ప్రకటన.. ఎందుకోతెలుసా..

నిర్మల్‌ మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (మే 27) ప్రకటించింది. నిర్మల్ మున్సిపల్ (Nirmal Municipalit) కార్యాలయంలో 44 మందిని అక్రమ మార్గంలో భర్తీ చేశారనే స్కాంను..

Nirmal: నిర్మల్ మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీని రద్దుచేస్తున్నట్లు సర్కార్‌ ప్రకటన.. ఎందుకోతెలుసా..
Nirmal Municipality
Follow us
Srilakshmi C

|

Updated on: May 27, 2022 | 12:42 PM

Nirmal Municipality Recruitment 2022: నిర్మల్‌ మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (మే 27) ప్రకటించింది. నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో 44 మందిని అక్రమ మార్గంలో భర్తీ చేశారనే స్కాంను టీవి9 మీడియా బయటపెట్టడంతో నియామకాల ప్రక్రియను నిలిపివేయడం జరిగింది. కాగా టీవి9లో వెలువడిన వరుస కథనాలకు స్పందించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దీనిపై విచారణకు ఆదేశించారు. తక్షణ విచారణకు ఆర్డీఓను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాగా మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీ గోల్ మాల్ వ్యవహరంలో నిర్మల్‌లో దుమారం రేగిన విషయం తెలిసిందే. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల చేపట్టిన నాలుగవ తరగతి ఉద్యోగాలపై పలు ఆరోపణలు రావడంతో ఉద్యోగాల నియామక ప్రక్రియను నిలుపుదల చేస్తూ మంత్రి ఈ మేరకు విచారణకు ఆదేశించారు.

పబ్లిక్ హెల్త్ వర్కర్లు, ఆఫీస్‌ సబార్డినెంట్స్, స్వీపర్ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత ఉన్న 44 మంది అభ్యర్థులతో ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో 50 శాతం ఉద్యోగాలను మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్లు, మున్సిపాలిటీ ఉద్యోగులు అంతా కలిసి తమ బంధువులకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచి వెనక్కి పంపించడమే కాకుండా చివరికి వారి పేర్లను జాబితాలో లేకుండా చేసినట్టు సమాచారం. నియామకాల విషయంలో బంధుప్రీతి చూపించినప్పటికి 44 పోస్టులకు ఒక్కో పోస్ట్‌కు 6 లక్షల నుండి 10 లక్షలు డిమాండ్ పలకగా ఓ ఆఫీస్ సబార్డినెట్ పోస్ట్‌ను చైర్మన్ బంధువు 14 లక్షలకు దక్కించున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు నియామక ప్రక్రియను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!