AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Scooters: ఓలా ఈవీల్లో కొత్త సమస్యలు.. ప్రయాణ సమయంలో విరిగిపోతున్న Ola S1 Pro స్కూటర్లు.. ఎందుకంటే

Ola Scooters: మెున్నటిదాకా Ola S1 Pro స్కూటర్లలో మంటలు చెలరేగటం, కాలిపోవటం వంటి ఘటనలు చేటుచేసుకోవటం మనం చూశాం. తాజాగా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు విరిగిపోతున్నాయంటూ అనేక కంప్లెయింట్స్ వస్తున్నాయి.

Ola Scooters: ఓలా ఈవీల్లో కొత్త సమస్యలు.. ప్రయాణ సమయంలో విరిగిపోతున్న Ola S1 Pro స్కూటర్లు.. ఎందుకంటే
Ola S1 Pro
Ayyappa Mamidi
|

Updated on: May 27, 2022 | 3:15 PM

Share

Ola Scooters: మెున్నటిదాకా Ola S1 Pro స్కూటర్లలో మంటలు చెలరేగటం, కాలిపోవటం వంటి ఘటనలు చేటుచేసుకోవటం మనం చూశాం. తాజాగా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు విరిగిపోతున్నాయంటూ అనేక కంప్లెయింట్స్ వస్తున్నాయి. Ola ఉచిత Ola S1 ప్రో స్కూటర్‌లు, ఇతర ఆకర్షణీయమైన మార్కెటింగ్ వ్యూహాలతో, కొత్త ఆఫర్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. కానీ ఇప్పటికే వాటిని వాడుతున్న కస్టమర్లు నాణ్యత, సర్వీసింగ్ సమస్యలు, బ్రేక్‌డౌన్‌ వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అదనంగా, స్కూటర్ల చుట్టూ అనేక వివాదాస్పద కథనాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటిలో యజమానులకు తీవ్ర గాయాలైన సందర్భాలు ఉన్నాయి. అటువంటి కేసుల జాబితాకు జోడిస్తూ, యజమాని తన విరిగిన Ola S1 ప్రో చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలో విరిగిన ఫ్రంట్ ఎండ్‌తో నలుపు రంగు స్కూటర్‌ ఒకటి కనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.. దెబ్బతిన్న స్కూటర్ చిత్రాలను శ్రీనాధ్ మీనన్ అనే ఓలా ఎస్1 ప్రో యూజర్ షేర్ చేశారు. తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రంట్ ఫోర్క్ విరిగిపోతుందని అతను వెల్లడించాడు. ఇది తీవ్రమైన సమస్య అని, ప్రమాదకరమైనదని అతను ఆరోపించాడు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు డిజైన్ మార్పు అవసరమని తాను భావిస్తున్నానని అంటున్నాడు. తక్కువ నాణ్యత కలిగిన మెటీరియల్ వినియోగించిన కారణంగా ఇలా జరుగుతోందని అన్నాడు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల నుంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ ట్విట్ లో కోరాడు. అంతేకాకుండా, స్కూటర్ నిర్మాణ నాణ్యత కారణంగా తాను ఎదుర్కొన్న తీవ్రమైన పరిస్థితిని వివరించాడు.

ఇటువంటి సమస్యనే తాము ఎదుర్కొన్నామంటూ కొందరు క్లెయిమ్ చేస్తూ ముందుకు వస్తున్నారు. గతంలో ఓలా స్కూటర్ వంగిన ఘటన ఒకటి చోటుచేసుకుంది. కేవలం నిర్మాణ పరమైన ఇబ్బందులే కాక.. సాఫ్ట్‌వేర్ బగ్‌లు, సర్వీస్ సమస్యలు, స్కూటర్‌తో సాంకేతిక స్నాగ్‌లను వినియోగదారులు ప్రస్తావిస్తున్నారు. పనితీరు, సర్వీసింగ్ సమస్యల కారణంగా మనిషి తన Ola S1 ప్రోని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకోవటం మనందరం గమనించాం.