AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీజీ అర్హతతో APPSC 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.1.82 లక్షల వరకు జీతం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్, ఎస్‌సీఈఆర్‌టీ సంస్థల్లో 160 సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు గరిష్ఠంగా రూ.1,82,400 వరకు జీతం లభిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 నవంబరు 18 నుంచి ప్రారంభమై డిసెంబరు 8న ముగుస్తాయి..

పీజీ అర్హతతో APPSC 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.1.82 లక్షల వరకు జీతం!
APPSC Lecturer and Senior Lecturer Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 17, 2026 | 6:44 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్ (DIET), ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) సంస్థల్లో ఖాళీగా ఉన్న సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాల ద్వారా మొత్తం 160 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 నవంబరు 18 నుంచి డిసెంబరు 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు, ఎంపిక విధానం తదితర వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

  • సీనియర్ లెక్చరర్ (DIET) – 46 పోస్టులు
  • లెక్చరర్ (SCERT) – 10 పోస్టులు
  • లెక్చరర్ (DIET) – 104 పోస్టులు

సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) డిగ్రీతో పాటు విద్యారంగంలో అవసరమైన వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఖచ్చితమైన విద్యార్హతలు, ఇతర నిబంధనలను ఏపీపీఎస్సీ విడుదల చేసే వివరణాత్మక నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. అలాగే 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 44 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, నిబంధనలు పూర్తిగా చదవాలి. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా నిర్వహిస్తారు. పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్, మార్కుల విధానం తదితర అంశాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు. సీనియర్ లెక్చరర్ (DIET): రూ.61,960 – రూ.1,51,370, లెక్చరర్ (SCERT): రూ.57,700 – రూ.1,82,400, లెక్చరర్ (DIET) రూ.54,060 – రూ.1,40,540 వరకు వేతనంగా చెల్లిస్తారు. ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే పీజీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశం. మొత్తం 160 పోస్టులు ఉండటంతో అర్హత ఉన్నవారు దరఖాస్తు గడువును దృష్టిలో ఉంచుకుని సిద్ధం కావాలి. పోస్టుల వారీగా ఖచ్చితమైన అర్హతలు, పరీక్షా విధానం, ఇతర వివరాల కోసం ఏపీపీఎస్సీ విడుదల చేసే పూర్తి అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: నవంబరు 18, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 8, 2026.

ఏపీపీఎస్సీ లెక్చరర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us