Bahubali Thali: భోజన ప్రియులకు నగరంలోని ఓ రెస్టారెంట్ బంపర్ ఆఫర్.. బాహుబలి థాలి తినండి.. లక్ష గెలుచుకోండి..

మీరు భోజన ప్రియులా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే కడుపునిండుగా పుష్టిగా తినవచ్చు.. అంతేకాదు అలా మీరు తినే ప్లేస్ లో ఉన్న ఆహారపదార్ధాలను పూర్తిగా తినేస్తే.. ఏకంగా లక్ష రూపాయలను కూడా బహుమతిగా పొందవచ్చు.

Bahubali Thali: భోజన ప్రియులకు నగరంలోని ఓ రెస్టారెంట్ బంపర్ ఆఫర్.. బాహుబలి థాలి తినండి.. లక్ష గెలుచుకోండి..
Baahubali Thali
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2022 | 12:31 PM

Bahubali Thali: ప్రపంచంలో భారతీయులు ఆహార ప్రియులు(Indian foodies) అన్న సంగతి తెలిసిందే. భారతీయులు తినే ఆహారం, పానీయాల విషయంలో ప్రపంచం జేజేలు పలుకుతుంది. అయితే దేశంలో అనేక ప్రాంతాలు.. అనేక సంప్రదాయాలు ఉన్నాయి.. వాటికీ అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోటీ కూరను తింటే.. మరికొన్ని ప్రాంతాల్లో అన్నం పప్పులను తినడానికి ఇష్టపడతారు. ప్రజల రుచిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వివిధ రెస్టారెంట్లు విభిన్నమైన ఆహారాలను, ఆఫర్స్ ను అందిస్తూనే ఉంది. తన కస్టమర్స్ ను ఆకర్షిస్తుంది. మీరు కనుక భోజన ప్రియులు అయితే.. విభిన్న రుచులను ఇష్టపడేవారు అయితే.. అలాంటివారి కోసం ఒక శుభవార్తను వినిపించనున్నాం.  మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే కడుపునిండుగా పుష్టిగా తినవచ్చు.. అంతేకాదు  అలా మీరు తినే ప్లేస్ లో ఉన్న ఆహారపదార్ధాలను పూర్తిగా తినేస్తే.. ఏకంగా లక్ష రూపాయలను కూడా బహుమతిగా పొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే..

ఈ బాహుబలి థాలీని హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌ ఆఫర్ చేస్తోంది. ఈ థాలీలో మొత్తం 30 శాకాహార, మాంసాహార పదార్ధాలు ఉంటాయి. చికెన్ బిర్యానీ, రొయ్యల కూర, షెజ్వాన్ నూడుల్స్ , రైతా , సలాడ్‌ సహా పానీయాలను అందిస్తారు.  ఇలా ఈ ప్లేట్‌లో 30 రకాల ఆహారపదార్ధాలు అందిస్తారు. అందుకనే దీనిని బాహుబలి థాలీ గా పిలుస్తున్నారు. ఈ ప్లేట్ ను రూ. 1800లకు అందిస్తున్నారు.

బహుమతి గెలవడానికి షరత్తులు వరిస్తాయి: కేవలం ఈ ప్లేట్ తింటే బహుమతిని గెలుచుకోచ్చు అని  అనుకుంటుంటే.. తప్పుగా ఆలోచిస్తున్నట్లే.. ఈ ప్లేట్ తిని బహుమతి గెలుచుకోవడానికి కొన్ని  నియమాలు ఏర్పరిచారు.  మీరు ఈ బాహుబలి ప్లేట్ ను కేవలం అరగంటలో పూర్తి చేయాలి. అవును.. ఈ ఆహారాన్ని 30 నిమిషాల సమయంలో పూర్తి చేస్తే.. బహుమతిని గెలుచుకుని లక్షాధికారి కావచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ బాహుబలి థాలీ ఛాలెంజ్ వార్త   ప్రజలకు తెలిసిన వెంటనే ఈ ప్లేటు ఫినిష్ చేసి లక్షాధికారులు కావాలనే తపనతో సుదూర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వర్కకూ ఈ బాహుబలి థాలీ ని ఒక్కరును పూర్తిగా అర్ధగంటలో తినలేకపోయారు. అయితే మీరు కనుక నగర వాసులు అయితే.. ఈ ప్లేట్‌ను పూర్తి చేసి.. బహుమతిని సొంతం చేసుకోవానే కోరిక ఉంటే.. మీరు సోమవారం నుండి గురువారం వరకు ఈ రెస్టారెంట్‌కి  వెళ్ళవచ్చు. ఒకసారి  ప్రయత్నించవచ్చు. ఈ ఛాలెంజ్ కు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఆతర్వాత ఈ ఛాలెంజ్ క్లోజ్ అవుతుంది. ఈ ప్రత్యేక ఆఫర్ కారణంగా..  ఈ రెస్టారెంట్‌కి భోజన ప్రియులు నగరం నలుమూలల నుంచి ఈ బాహుబలి ప్లేట్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..