AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మనిషితో అడవిపంది 25 ఏళ్లుగా స్నేహ గీతం.. ఈ అరుదైన బంధం వెనుక స్టోరీ తెలుసా

వానలో బాగా తడిచి కొన ఊపిరితో ఉన్న పందిపిల్లను చూసిన మహేంద్ర జాలిపడి దానిని చేరదీశాడు. దానికి ఆహారం అందించి రక్షణ కల్పించాడు. అప్పటి నుంచి ఆ అడవి పంది పిల్ల మహేంద్ర కుంటుంబంలో ఓ సభ్యురాలు అయింది.

Viral News: మనిషితో అడవిపంది 25 ఏళ్లుగా స్నేహ గీతం.. ఈ అరుదైన బంధం వెనుక స్టోరీ తెలుసా
Pig
Surya Kala
|

Updated on: May 27, 2022 | 10:43 AM

Share

Man and wild boar friendship: ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తన అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం సాటి మనిషిని శత్రువుగా భావించే రోజులు వచ్చాయి. అయితే మనిషికి జంతువులకు మధ్య మాత్రం మంచి స్నేహం ఏర్పడి.. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ సొంతం కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాడు. కొందరైతే.. ఏకంగా తమ పెంపుడు జంతువులకు పుట్టిన రోజు, శ్రీమంతం వంటి వేడుకలతో పాటు.. కొన్ని సార్లు కొంతమంది ఏకంగా తమ ఆస్తులను కూడా తమ పెంపుడు జంతువుల పేరున రాస్తున్నారు.  అందుకనే మనిషి-జంతు స్నేహంపై కథనాలు ఎప్పుడూ మనసుని ఆకట్టుకుంటాయి. తమను ప్రేమగా చూసే యజమాని పట్ల జంతువులూ చూపించే విశ్వాసం హృదయాలను ద్రవింపజేస్తాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి.. ఏకంగా అడవి పందితో స్నేహం చేశాడు. అది కూడా ఒక్కరోజు రెండు రోజులో.. ఒక ఏడాదో కాదు… ఏకంగా 25 ఏళ్ల నుంచి ఆ వ్యక్తికీ, అడవి పందికి మధ్య స్నేహం బంధం కొనసాగుతోంది. మల్కన్‌గిరి నివాసి మహేంద్ర పాత్ర కుటుంబసభ్యుడిగా అడవి పంది వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో మహేంద్ర అనే వ్యక్తి నివసిస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం మహేంద్ర నివసిస్తున్న ప్రాంతానికి వరదలు రాగా.. ఆ వరదల్లో ఓ పంది పిల్ల కొట్టుకువచ్చింది. అప్పుడు అలా నీటిలో కొట్టుకుపోతున్న అడవి పంది పిల్లని మహేంద్ర రక్షించి.. దానిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళాడు.అప్పటికే వానలో బాగా తడిచి కొన ఊపిరితో ఉన్న పందిపిల్లను చూసిన మహేంద్ర జాలిపడి దానిని చేరదీశాడు. దానికి ఆహారం అందించి రక్షణ కల్పించాడు. అప్పటి నుంచి ఆ అడవి పంది పిల్ల మహేంద్ర కుంటుంబంలో ఓ సభ్యురాలు అయింది. కొన్ని రోజుల తర్వాత అటవీ శాఖ సిబ్బందికి సమాచారమందించాడు.  చిన్న పిల్లను అడవిలో వదిలితే క్షేమంగా ఉండదని వారు భావించి అప్పటికి మహేంద్రనే ఆ పిల్లని పెంచమని చెప్పారు. దీంతో మహేంద్ర చేసేది లేక తానే ఆ పందిని పెంచుకున్నాడు. ముద్దుగా దానికి రాజు అని పేరు పెట్టుకున్నాడు.

కొంచెం పెద్దయ్యాక దీనిని అటవీశాఖ అధికారులు అడివిలో విడిచి పెట్టినా కొంతకాలం తర్వాత తిరిగి వస్తుంది. ఇలా రెండు సార్లు జరిగింది. అంతేకాదు మహేంద్రుడు తనకు ఏది తినిపిస్తే అది అడవి పంది తింటుంది. ఎవరైనా ఏదైనా పెట్టినా అడవి పంది ఎప్పుడూ తినదు. దీంతో దానిపై ప్రేమ ఎక్కువైన మహేంద్ర అప్పటినుంచి దానిని అంటిపెట్టున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆయన ఓ గుడిలో నివసిస్తున్నారు. జనం కూడా అడవి పందితో స్నేహంగా ఉంటారు. ఇప్పటి వరకూ ఎవరికీ హాని తలపెట్టలేదు. ఆహారం కోసం కొన్నిసార్లు ఆ పంది అడవిలోకి వెళ్లినా సాయంత్రం అయ్యేసరికి తిరిగి మహేంద్ర ఇంటికి చేరుకుంటుంది. రాత్రి వేళ మహేంద్రను విడిచి ఆ పంది నిద్ర కూడా పోదు. అది తన వద్దకు వచ్చిన సమయంలో దాని బరువు 400 గ్రాములు ఉందని.. ఇప్పుడు మంచి పుష్టిగా తయారైందని చెబుతున్నాడు. మహేంద్ర తాను తినే గుడి భోగ్, పండ్లు , ఒడిశా, బియ్యం , దాల్మా వంటి  వంటకాలనే అడవి పందికి పెడతాడు. అంతేకాదు ఎప్పుడూ అది నాన్ వెజ్ తినదు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య స్నేహం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్నేహానికి ఫిదా అవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..