Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: భారత్ సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది.. క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ..

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ క్వాడ్ సదస్సుకు హాజరై పలు అంశాలపై చర్చించారు.

PM Narendra Modi: భారత్ సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది.. క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ..
Quad Summit 2022
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2022 | 9:33 AM

Quad Summit 2022 – PM Modi: క్వాడ్.. ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుందని.. ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్వాడ్‌ అనేది అందరి కోసం కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ అభివృద్ధి, భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభివర్ణించారు. క్వాడ్ దేశాలకు భారత్ సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్‌ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ ఈ సదస్సుకు హాజరై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరింత ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.

కరోనా ప్రతికూల ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్‌ పంపిణీ, క్లైమేట్‌ యాక్షన్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌, ఆర్థిక తోడ్పాటుతోపాటు పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్‌ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కాగా.. ఈ సదస్సులో బైడన్, మోడీ, కిషిదా, ఆంటోనీ రష్యా ఉక్రెయిన్ పరిస్థితులు, చైనా దూకుడు, పర్యావరణం, దౌత్య సంబంధాలు తదితర అంశాలపై మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

సదస్సుకు ముందు.. బైడెన్‌, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయి.. ప్రధాని మోడీ ద్వైపాకక్షిక సంబంధాలపై చర్చించారు. కాగా.. క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఇతర ప్రపంచ నేతలు స్వాగతం పలికారు. ప్రత్యక్షంగా కలుసుకోవడం మంచి పరిణామమంటూ పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..