PM Modi: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక.. మరింత ముదురుతున్న టీఆర్ఎస్ – బీజేపీ వార్

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనపై మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌కు వస్తున్నారు.

PM Modi: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక.. మరింత ముదురుతున్న టీఆర్ఎస్ - బీజేపీ వార్
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2022 | 8:46 AM

PM Narendra Modi Hyderabad Tour: బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య డైలాగ్‌ వార్‌ మరింత ముదురుతోంది. ధాన్యం దంగల్‌ నుంచి షురూ అయిన మాటల యుద్ధం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. తాజాగా ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనపై మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌కు వస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ అందించనున్నారు ప్రధాని మోదీ. మొత్తం గంట పాటు సాగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ టూర్ పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పీఎం ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. మరోవైపు ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు సాధారణంగా ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతుంటారు. కానీ ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ రావడం లేదు. దీంతో కేంద్రం, తెలంగాణ సర్కార్‌ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని మరోసారి తేటతెల్లమైంది. కాగా.. ప్రధాని బిజీ షెడ్యూల్‌ కారణంగానే ముఖ్యమంత్రి రాలేకపోతున్నారని ISB డీన్ మదన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 5న హైదరాబాద్‌కు మోదీ వచ్చినప్పడు కూడా కేసీఆర్‌ స్వాగతం పలకలేదు. గడిచిన రెండేళ్లలో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. మరోవైపు ప్రధాని టూర్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్‌ చేస్తోంది తెలంగాణ బీజేపీ. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్.. ఢిల్లీ, పలు రాష్ట్రాల పర్యటన నేపథ్యంలోనే.. ప్రధాని మోడీ తెలంగాణకు రానుండటం ఆసక్తికరంగా మారింది.

విద్యార్థులపై నజర్

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే..ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ ఐఎస్‌బీని ఆధీనంలోకి తీసుకుంది. విద్యార్థుల సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా పోస్టులు చేసిన విద్యార్థులను సదస్సుకు హాజరుకాకుండా చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి