YS Jagan-KTR: దావోస్‌లో ఆసక్తికర పరిణామం.. ఆ వ్యాఖ్యల తర్వాత ఒకే వేదికపై వైఎస్‌ జగన్‌-మంత్రి కేటీఆర్‌

YS Jagan-KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు ..

YS Jagan-KTR: దావోస్‌లో ఆసక్తికర పరిణామం.. ఆ వ్యాఖ్యల తర్వాత ఒకే వేదికపై వైఎస్‌ జగన్‌-మంత్రి కేటీఆర్‌
Follow us
Subhash Goud

|

Updated on: May 24, 2022 | 8:44 AM

YS Jagan-KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. అయితే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా దావోస్‌ పర్యటనలో ఉన్నారు. ఇటు ఏపీ సీఎం జగన్‌, అటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దావోస్‌లో సీఎం జగన్, మంత్రి కేటీఆర్‌లు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కూడా ఇరు రాష్ట్రాల పెట్టుబడులపై చర్చించుకున్నారు. సీఎం జగన్‌, మంత్రి కేటీఆర్‌తో కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది. ఇదిలా ఉంటే రాజకీయాల పరంగా మాటల యుద్ధాలు కొనసాగుతున్నా.. పెట్టుబడుల విషయంలో తెలుగు రాష్ట్రాలు మాత్రం పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

ఇటీవల మంత్రి కేటీఆర్ ఏపీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పక్క రాష్ట్రం ఏపీలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో ఏపీ మంత్రులు కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ఎన్నికల స్టంట్ కాదంటూ చురకలంటించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ట్విట్టర్‌ వేదికగా వివరణ సైతం ఇచ్చారు. క్రెడాయ్‌ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చంటూ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. ఎవరినో బాధపెట్టాలనో.. కించపరచాలనో అలా మాట్లాడలేదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం జగన్‌ (YS Jagan) ను సోదర సమానుడిగా భావిస్తున్నానని.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్​ట్విట్‌లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు దావోస్‌లో జగన్‌, కేటీఆర్‌లు పరస్పరం కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి