Dream11: డ్రీమ్ 11లో జాక్‌పాట్.. రాత్రికి రాత్రే రూ.2 కోట్లు.. తల్లికి వైద్యం చేయిస్తానంటున్న యువకుడు
Dream11: జమ్మూకశ్మీర్‌లోని బిజ్‌బెహరా ప్రాంతంలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రాజా అనే యువకుడు రూ.2 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
Dream11: ఆన్‌లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’ ఓ నిరుపేద యువకుడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడ్ని చేసింది. దాంతో ఆ యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి మెరుగైన వైద్యం చేయించే అవకాశం దక్కిందని తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని బిజ్‌బెహరా ప్రాంతంలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రాజా అనే యువకుడు రూ.2 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వసీం రాజా రెండేళ్లుగా ‘డ్రీమ్ 11’లో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి క్రీడా విభాగాల్లో బెట్టింగ్ పెడుతున్నాడు. శనివారం కూడా అదే తరహాలో బెట్టింగ్ పెట్టగా.. జాక్‌పాట్ తగిలింది. అతను ఎంచుకున్న జట్టు మొదటి స్థానంలో ఉందని, ఆ విషయం ‘‘శనివారం రాత్రి తాను నిద్రలో ఉండగా అతని స్నేహితుడు తనకి ఫోన్ చేచి చెప్పినట్లు తెలిపాడని, లేచి చూసేసరికి.. తాను 2 కోట్లు గెల్చుకున్నట్లు ఉందని చెప్పాడు. అంతా కలలా అనిపిస్తోందన్నాడు.
గత రెండేళ్ల నుంచి ఐపీఎల్‌లో ఫాంటసీ టీమ్‌లను సృష్టించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా వసీం.. “మాది పేద కుటుంబం, ఈ డబ్బుతో మా పరిస్థితి మారుతుంది. మా అమ్మ 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఇక మెరుగైన చికిత్స చేయిస్తా’’ అంటూ చెప్పుకొచ్చాడు. వసీం రాజాను అభినందించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రీమ్11లో విజేతగా నిలిచాడన్న వార్తతో రాజా గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. Dream11 అనేది ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతించే భారతీయ ఫాంటసీ క్రీడా వేదిక. ఏప్రిల్ 2019లో, డ్రీమ్11 యునికార్న్‌గా మారిన మొదటి భారతీయ గేమింగ్ కంపెనీగా అవతరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..