Petrol and Diesel Prices: ఎక్సైజ్‌ సుంకం తగ్గిన తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol and Diesel Prices: ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో భారీగా కోత పడింది. అంతే కాకుండా రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా తగ్గించాయి. అయితే ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో..

Petrol and Diesel Prices: ఎక్సైజ్‌ సుంకం తగ్గిన తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
Petrol And Diesel Prices Today
Follow us

|

Updated on: May 24, 2022 | 8:10 AM

Petrol and Diesel Prices: ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో భారీగా కోత పడింది. అంతే కాకుండా రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా తగ్గించాయి. అయితే ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. అయితే మే 22న, ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా దీని ధర రూ.8.69 తగ్గింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.16 తగ్గి రూ.111.35కి చేరుకుంది. కోల్‌కతాలో ధర రూ.9.09 తగ్గి రూ.106.03కి చేరుకుంది. చెన్నైలో ఈ ధర రూ.8.22 తగ్గడంతో రూ.102.63కి పడిపోయింది. ఇక ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.89.62గా ఉంది. మే 22న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.7.05 తగ్గించారు. ముంబైలో లీటర్‌ డీజిల్ ధర రూ.7.49 తగ్గింపు తర్వాత రూ.97.28గా ఉంది. కోల్‌కతాలో రూ.7.07 తగ్గి రూ.92.76కి, చెన్నైలో రూ.6.7 తగ్గి రూ.94.24కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.83 తగ్గి ప్రస్తుతం రూ.109.67 ఉండగా, డీజిల్‌పై రూ.7.67 తగ్గి రూ.97.82కు చేరుకుంది.

కేంద్ర ప్రభుత్వం ఎంత పన్ను తగ్గించింది?

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కోత తర్వాత ఇప్పుడు పెట్రోలు రూ.9.5 తగ్గుతుందని, డీజిల్ కూడా లీటరుకు రూ.7 తగ్గుతుందని చెప్పారు. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల ఖజానాపై ఏటా దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడనుంది.

ఇవి కూడా చదవండి

ఏ రాష్ట్రంలో ఎంత?

కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాయి. రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 చొప్పున వ్యాట్ తగ్గింపును ప్రకటించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 చొప్పున వ్యాట్‌ను తగ్గించింది. ఒడిశా ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.2.23, డీజిల్‌పై రూ.1.36 వ్యాట్‌ను తగ్గించింది. మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌ను తగ్గించింది.

ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు.  మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పంపితే ధరల వివరాలు వస్తాయి. మీ నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను SMS రూపంలో తెలుసుకునేందుకు RSP కోడ్ కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..